Balakrishna , Mokshagna: మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ నిర్మాత విషయంలో ట్విస్ట్.. ఏం జరిగిందంటే?

నందమూరి మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ గురించి గత కొన్నేళ్లుగా చర్చ జరుగుతుండగా ఈ ఏడాది ఎట్టకేలకు మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా మైథలాజికల్ టచ్ తో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. సినిమాలో అర్జునుడి పాత్రలో బాలయ్య (Balakrishna) అభిమన్యుడి పాత్రలో మోక్షజ్ఞ కనిపిస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండగా సుధాకర్ చెరుకూరి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నారని తెలుస్తోంది.

Balakrishna , Mokshagna

బాలయ్య కూతురు తేజస్విని ఈ సినిమాను నిర్మించే ఛాన్స్ ఉందని వార్తలు వినిపించగా ఆమె ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరిస్తారేమో క్లారిటీ రావాల్సి ఉంది. ప్రశాంత్ వర్మ   (Prasanth Varma) డైరెక్షన్ లో బాలయ్య మోక్షజ్ఞ కాంబినేషన్ లో సినిమా అంటే ఏ రేంజ్ లో అంచనాలు నెలకొంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే బాలయ్య పాత్ర నిడివి పరిమితమేనని సమాచారం అందుతోంది.

త్వరలో ఈ సినిమాకు సంబంధించి అధికారికంగా అన్ని వివరాలు వెల్లడి కానున్నాయి. ఈ సినిమా షూటింగ్ ను వేగంగా పూర్తి చేయాలని భావిస్తున్నారని 2026లో ఈ సినిమా విడుదలయ్యే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. నందమూరి బాలకృష్ణ, మోక్షజ్ఞలను సిల్వర్ స్క్రీన్ పై ఒకే ఫ్రేమ్ లో చూస్తే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు అయితే ఉండవని చెప్పవచ్చు.

బాలయ్య, మోక్షజ్ఞ ఈ సినిమాకు ఎంత పారితోషికం అందుకుంటారనే చర్చ సైతం జరుగుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలోని క్రేజీ ప్రాజెక్ట్ లలో ఈ సినిమా ఒకటిగా నిలుస్తుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. మైథలాజికల్ టచ్ తో తెరకెక్కిన సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ సాధిస్తున్న నేపథ్యంలో బాలయ్య మోక్షజ్ఞ కాంబో మూవీ కూడా సంచలనాలు సృష్టిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రశాంత్ వర్మ వరుస అప్ డేట్స్ తో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలను పెంచనున్నారని భోగట్టా.

అక్కడ అదిరిపోయే రికార్డ్స్ ను అందుకున్న మహేష్, నాని.. ఏమైందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus