Nani: అక్కడ అదిరిపోయే రికార్డ్స్ ను అందుకున్న మహేష్, నాని.. ఏమైందంటే?

టాలీవుడ్ స్టార్ హీరోలు మహేష్ బాబు (Mahesh Babu) , నాని (Nani) ఒకవైపు మాస్ సినిమాలలో నటిస్తూనే మరోవైపు క్లాస్ సినిమాలలో సైతం నటిస్తూ తమ నటనతో మెప్పిస్తున్నారు. ఈ ఇద్దరు హీరోలకు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండగా అదే సమయంలో వరుస విజయాలు దక్కుతున్నాయి. ఓవర్సీస్ రికార్డుల విషయంలో మహేష్ బాబు టాప్ లో నిలవగా నాని సెకండ్ ప్లేస్ లో నిలవడం హాట్ టాపిక్ అవుతోంది.

Nani

ఓవర్సీస్ లో మహేష్ బాబు నటించిన 12 సినిమాలు 1 మిలియన్ డాలర్ల కలెక్షన్లను సొంతం చేసుకోగా నాని నటించిన 10 సినిమాలు ఈ రికార్డ్ ను అందుకోవడం గమనార్హం. ఓవర్సీస్ ప్రేక్షకులను మెప్పించే విషయంలో ఈ ఇద్దరు హీరోలు ముందువరసలో ఉన్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నాని వేగంగా సినిమాల్లో నటిస్తుండటంతో రాబోయే రోజుల్లో మహేష్ రికార్డ్ బ్రేక్ అవుతుందేమో అనే చర్చ సైతం జరుగుతోంది. సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) ఓవర్సీస్ లో 1 మిలియన్ డాలర్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.

నాని స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు నవ్యత ఉన్న కథాంశాలకు ఓటేస్తుండటంతో ఓవర్సీస్ ప్రేక్షకులు సైతం నాని సినిమాలను హిట్ చేస్తున్నారనే కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. నాని బ్యాక్ టు బ్యాక్ హిట్లను అందుకుంటూ సక్సెస్ రేట్ ను పెంచుకుంటున్నారు. న్యాచురల్ స్టార్ నాని యంగ్ డైరెక్టర్లకు వరుస అవకాశాలు ఇస్తూ సక్సెస్ సాధిస్తున్నారు. కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చే విషయంలో నాగార్జున (Nagarjuna) తర్వాత నాని ఉన్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

నాని ఏడాదికి రెండు సినిమాలు విడుదలయ్యేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటూ తన సినిమాలతో థియేటర్లు కళకళలాడేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నాని శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) కాంబో మూవీ షూట్ త్వరలో మొదలు కానుండగా 2025 సమ్మర్ టార్గెట్ గా ఈ సినిమా షూట్ జరుగుతోందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. నాని రెమ్యునరేషన్ 25 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.

అక్కడ దేవర అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు.. ప్రీ సేల్స్ లో దేవర జోరు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus