Akhanda 2: స్కెచ్‌లు రెడీ.. బాలయ్య రాకే ఆలస్యమా? ‘అఖండ 2’ అప్‌డేట్‌ ఇదే!

Advertisement

నందమూరి బాలకృష్ణ (Balakrishna) – బోయపాటి శ్రీను (Boyapati Srinu) .. ఈ కాంబినేషన్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. బాలయ్య విత్‌ యాక్షన్‌ అంటే.. లౌడ్‌నెస్‌ అనే ఫీలింగ్‌ నుండి బయటపడేశారు బోయపాటి శ్రీను. పెద్ద పెద్ద డైలాగ్స్‌ కాకుండా షార్ట్‌గా షార్ప్‌గా ఉండేలా మాటలు రాస్తూ సరికొత్తగా బాలయ్యను చూపించారు. ఇప్పటికే హ్యాట్రిక్‌ కొట్టిన ఈ కాంబో.. సెకండ్‌ హ్యాట్రిక్‌ స్టార్ట్‌ చేసే పనిలో ఉంది. ఈ క్రమంలో ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది.

Akhanda 2

బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో ‘అఖండ 2’ (Ahanda) అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అనౌన్స్‌మెంట్‌ రావాల్సి ఉన్నా.. నిర్మాణ సంస్థ విషయంలో ఎక్కడో మెలిక ఉంది అని అంటున్నారు. తొలి సినిమాను మిరియాల రవీంద్ర రెడ్డి (Miryala Ravinder Reddy) నిర్మించారు. రెండో సినిమా (Akhanda 2) కోసం అగ్ర నిర్మాణ సంస్థ రెడీ అవుతోంది. ఇక్కడే బ్రేక్‌ పడింది అని టాక్‌. ఈ లోపు బోయపాటి సినిమా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ చేస్తున్నారట.

అలా సినిమాలో ప్రధాన నటుల లుక్‌ కోసం కొన్ని త్రీడీ స్కెచ్‌లు సిద్ధం చేశారు అని సమాచారం వస్తోంది. పాత్రల గెటప్, సెటప్ మీద దృష్టి పెట్టిన టీమ్‌ ఈ మేరకు ప్రత్యేకంగా 3డీ స్కెచెస్ వేయిస్తున్నారట. ప్రస్తుతం బాలయ్య.. బాబీ  (Bobby) సినిమా పనిలో బిజీగా ఉన్నారు. అదయ్యాక ఇటు వచ్చేస్తారట. ఈ లోపు అన్ని పనులూ ముగించేయాలని బోయపాటి ప్రణాళిక వేసుకున్నరట.

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ (Sanjay Dutt) ఓ కీలక పాత్రలో కనిపిస్తారని వార్తలొస్తున్నాయి. అలాగే ఈసారి ఓ యంగ్‌ హీరో అవసరం కూడా ఉందని.. అది విశ్వక్‌సేన్‌ (Vishwak Sen)  అవ్వొచ్చు అని కూడా అంటున్నారు. విజయదశమి సందర్భంగా ఈ మొత్తం విషయాల మీద క్లారిటీ వస్తుంది అని చెప్పొచ్చు. ఆ సినిమా అనౌన్స్‌మెంట్‌ ఉంటుంది అని చెబుతున్నారు. అయితే అప్పటికి ఇష్యూస్‌ క్లియర్‌ అవుతాయా? లేక BB4 అని మాత్రమే చెబుతారా అనేది చూడాలి.

వార్నర్‌ వచ్చేశాడా? రెండు సినిమాలు ఓకే చేశాడా? నిజమా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus