David Warner: వార్నర్‌ వచ్చేశాడా? రెండు సినిమాలు ఓకే చేశాడా? నిజమా?

ప్రముఖ ఆస్ట్రేలియన్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌కు (David Warner) మనకు బాగా దగ్గరైపోయాడు. తొలుత సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఆడినప్పుడు ‘మన డేవిడ్‌ భాయ్‌’ అని అనుకున్నారు. ఆ తర్వాత వివిధ కారణాల వల్ల ఆయన వేరే టీమ్‌లకు వెళ్లిపోయినా మనవాడిగానే ఉన్నాడు. ఈ క్రమంలో తెలుగు సినిమా పాటలకు రీల్స్‌ చేస్తూ ‘నేను మీ వాడినే’ అని చెప్పకనే చెప్పాడు. ఆయన రీల్స్‌ అప్పట్లో ఒక ట్రెండ్‌. అలాంటి డేవిడ్‌ వార్నర్‌ తెలుగు సినిమాల్లో నటిస్తున్నాడా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు.

David Warner

ఇంకా చెప్పాలంటే ఆల్‌ రెడీ ఓ పాటలో యాక్ట్ కూడా చేశాడు అని చెబుతున్నారు. నితిన్‌ (Nithiin) – శ్రీలీల (Sreeleela) – వెంకీ కుడుముల  (Venky Kudumula)  కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘రాబిన్‌ హుడ్‌’ ’ (Robinhood)  అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగింది. అక్కడ నితిన్‌ – శ్రీలీల మీద ఓ పాట షూట్‌ చేశారు. అందులో స్పెషల్‌ అట్రాక్షన్‌గా డేవిడ్‌ వార్నర్‌ కనిపిస్తాడు అని అంటున్నారు. లొకేషన్లోని కొన్ని స్టిల్స్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి.

ఇదిలా ఉండగా.. మరో తెలుగు సినిమాలోనూ వార్నర్‌ నటించబోతున్నాడు అంటున్నారు. అది కూడా పాటలోనే అని చెబుతున్నారు. ఈ సారి ఆ సినిమా పాన్‌ ఇండియాది అని చెబుతున్నారు. వార్నర్‌ ఇన్‌స్టా రీల్స్‌ చేసిన పాటల్లో బాగా హైలైట్‌ అయినవి చాలా ఉన్నాయి. అయితే అందులో ‘పుష్ప: ది రైజ్‌’ (Pushpa) పాటలు ఎక్కువ ఫేమస్‌ అయ్యాయి. అందుకేనేమో ఆ సినిమా సీక్వెల్‌లో ప్రత్యేకంగా కనిపించబోతున్నాడు అని చెబుతున్నారు.

ఈ సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌ ఉందని అందులో కాసేపు కనిపిస్తాడని వార్తలొస్తున్నాయి. అలాగే ఓ సరదా డాన్‌ పాత్ర కూడా ఉందని.. అది వార్నర్‌ (David Warner) అవ్వొచ్చని టాక్‌ నడుస్తోంది. ఏదైతేముంది మన డేవిడ్‌ భాయ్‌ సినిమాల్లోకి వచ్చేస్తున్నాడు. తెర మీద చూసి మనమూ ఓ ఇన్‌స్టా రీల్‌ చేసి షేర్‌ చేసేయడమే. డిసెంబరులోనే పై రెండు సినిమాలు వచ్చే అవకాశం ఉంది.

చిరంజీవితో విబేధాలపై కొరటాల రియాక్షన్ ఇదే.. ఏం చెప్పారంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus