Balakrishna: బాలయ్య చిరంజీవి సినిమాను ఎన్ని సార్లు చూశారో తెలిస్తే షాక్ అవుతారు!

  • July 6, 2023 / 04:56 PM IST

సినిమా ఇండ్రీస్టీలో సినిమాలు రిలీజ్ చేయడంలో పోటీ అనేది సర్వసాధారణం.. అయితే ఎక్కువగా పోటీ పడిన హీరోలు ఎవరని సినిమా ప్రియులను అడిగితే ఠక్కున చిరంజీవి-బాలకృష్ణ అని అంటారు. ఈ ఇద్దరు హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడినా వ్యక్తిగతంగా మాత్రం మంచి స్నేహితులు. ఒకరి గురించి ఒకరు మంచిగా మాట్లాడుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి.అయితే బాక్సాఫీస్ వద్ద పోటీ పరంగా ఈ ఇద్దరు హీరోలు నేటికి అసలు తగ్గడం లేదు.

ఈ ఏడాది సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ పోటీ పడ్డారు. రెండు సినిమాలు సూపర్ హిట్ అయితే ‘వాల్తేరు వీరయ్య’ మాత్రం అత్యధిక వసూళ్లు రాబట్టింది. వీరి మధ్య ఏకంగా 15 సార్లు బాక్సాఫీస్ వార్ జరగడం, ఒకసారి చిరంజీవి గెలుపొందడం, మరో సారి బాలయ్య గెలుపొందడంతో వీరి మధ్య పోటీ చాలా ఆసక్తికరంగా సాగింది. అయితే బాలయ్య బాబుకు చిరంజీవి నటించిన సూపర్ హిట్ సినిమా ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ అట.

ఈ సినిమాను కనీసం 100 సార్లు చూశానని (Balakrishna) బాలయ్యబాబు స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. గతంలో ఈ సినిమాలోని పాటలు, సెట్టింగులు, చిరంజీవి నటన, శ్రీదేవి అందం అన్నీ తనకు నచ్చాయని, తెలుగు సినీ పరిశ్రమ ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా ఇదని బాలయ్య అన్నారు. ఇప్పుడు కూడా ఈ సినిమా తన ఖాళీ సమయాల్లో టీవీలో వచ్చినప్పుడు చూడటానికి ఇష్టపడుతానన్నారు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus