బాలయ్య బాబీ కాంబో సినిమాకు అదిరిపోయే టైటిల్ ఫిక్స్ అయిందా?

బాలయ్య (Balakrishna)  బాబీ (Bobby) కాంబో మూవీ షూట్ శరవేగంగా జరుగుతోంది. బాలయ్య పొలిటికల్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నా బాబీ మాత్రం బాలయ్య కాంబినేషన్ లేని సీన్లను షూట్ చేస్తూ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ సినిమాకు వీరమాస్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఈ టైటిల్ బాగుందని బాలయ్య ఫ్యాన్స్ సైతం అభిప్రాయపడుతున్నారు. బాలయ్య మాస్ సినిమాల్లో నటించడానికి ఎంతగానో ఇష్టపడతారు. బాలయ్య బాబీ కాంబో సినిమాకు అదిరిపోయే టైటిల్ ఫిక్స్ అయిందని ఈ టైటిల్ నే ఫిక్స్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

కొన్నిరోజుల క్రితం ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. త్వరలో ఈ సినిమాలో నటించే నటీనటులకు సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు. బాలయ్య బాబీ మూవీ గురించి త్వరలో మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి. బాలయ్య గత మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి కళ్లు చెదిరే లాభాలను అందించాయి.

గ్లింప్స్ తో అంచనాలు పెంచేసిన బాలయ్య టీజర్, ట్రైలర్ తో ఏ స్థాయిలో మెప్పిస్తారో చూడాలి. బాలయ్య ఈ సినిమాలో అదిరిపోయే లుక్ లో కనిపించడం గమనార్హం. 30 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకుంటున్న బాలయ్య ఈ సినిమాతో మరో సక్సెస్ అందుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాలయ్య ఫ్యాన్స్ బాలయ్య సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలని కోరుకుంటున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాతో బాలయ్య ఫ్యాన్స్ కు ఆ కోరిక సైతం నెరవేరనుంది. బాలయ్య క్రేజ్, పాపులారిటీ, రేంజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు. బాలయ్య ఇతర భాషల్లో సైతం సక్సెస్ సాధిస్తే బాలయ్య సినిమాలు సులువుగా 100 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లు సాధించే ఛాన్స్ అయితే ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus