Jr NTR: ఎన్టీఆర్ గ్యారేజ్ లో మరో కారు చేరిందా.. కారు ఖరీదెంతో తెలుసా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు (Jr NTR) కార్లు అంటే ఎంతో ఇష్టమనే సంగతి తెలిసిందే. తారక్ తాజాగా మరో కొత్త కారును కొనుగోలు చేయగా ఆ కారుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి తారక్ ఈరోజు ఖైరతాబాద్ లో ఉన్న ఆర్డీవో కార్యాలయంలో దర్శనమిచ్చారు. గ్లోబల్ స్టార్ గా క్రేజ్ ఉన్న తారక్ ఖైరతాబాద్ కార్యాలయంలో కనిపించడంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

మెర్సిడెస్ బెంజ్ మేబ్యాక్ మోడల్ కారును తారక్ ఇటీవల కొనుగోలు చేయగా ఆ కారు రిజిస్ట్రేషన్ కోసం తారక్ ఖైరతాబాద్ కార్యాలయానికి వచ్చారు. ఈ కారు ఖరీదు 4 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంటుందని తెలుస్తోంది. ఆర్డీవో కార్యాలయ అధికారులు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో ఫార్మాలిటీస్ ను పూర్తి చేయించడంతో పాటు తారక్ తో సంతకాలు చేయించుకున్నారు.

ఏడాదికి ఒక లగ్జరీ కారును కొనుగోలు చేస్తూ తారక్ వార్తల్లో నిలుస్తున్నారు. కెరీర్ ను కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఏడాదికి ఒక సినిమా విడుదలయ్యేలా తారక్ కెరీర్ ప్లానింగ్ అయితే ఉంది. జూనియర్ ఎన్టీఆర్ కారుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా ఆ వీడియోలు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. ఎన్టీఆర్ పర్ఫెక్ట్ మూవీ ప్లానింగ్ తో కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

దేవర, వార్2 సినిమాలు కొన్ని నెలల గ్యాప్ లో థియేటర్లలో విడుదలవుతూ ఉండటం గమనార్హం. దేవర (Devara) , వార్2 సినిమాలు రిలీజ్ తర్వాత సరికొత్త రికార్డులు క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా విడుదలవుతూ ఉండటం ఫ్యాన్స్ కు మరింత సంతోషాన్ని కలిగిస్తోంది. తారక్ యాక్టింగ్ స్కిల్స్ కు ఇతర భాషల ప్రేక్షకులు సైతం ఫిదా అవుతున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus