Actress Sukanya: సీనియర్ హీరోయిన్ సుకన్య గుర్తుందా.. ఇప్పుడేం చేస్తుందంటే..!

ఒకప్పటి హీరోయిన్ సుకన్య (Sukanya) అందరికీ గుర్తుండే ఉంటుంది.’పెద్దరికం’ ని చెప్పుకుంటారు. ‘పెద్దరికం’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ తర్వాత రాజశేఖర్ తో ‘అమ్మ కొడుకు’ , ‘భారతీయుడు'(డబ్బింగ్) వంటి సినిమాల్లో నటించింది. కానీ స్టార్ స్టేటస్ ను మాత్రం దక్కించుకోలేకపోయింది. అయితే 2002లో శ్రీధరన్ రాజగోపాలన్ అనే వ్యక్తిని ఈమె పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. అయితే ఏడాదికే అంటే 2003 లోనే అతనితో విడాకులు తీసుకుంది.

ఈ దంపతులకి ఓ కూతురు ఉంది. అటు తర్వాత సుకన్య వ్యభిచారం చేస్తూ పట్టుబడినట్టు కథనాలు వినిపించాయి. ఇది పక్కన పెట్టేస్తే.. మళ్ళీ ఆమె రీ ఎంట్రీ ఇచ్చి ‘శ్రీ’ (Sree) ‘మున్నా (Munna) వంటి సినిమాల్లో నటించింది. అవి సక్సెస్ కాకపోవడంతో ఈమె సెకండ్ ఇన్నింగ్స్ కి బూస్టప్ అందలేదు. అయితే 2015 లో వచ్చిన ‘శ్రీమంతుడు’ (Srimanthudu) లో ఈమె మహేష్ బాబుకు (Mahesh Babu) తల్లి పాత్రలో నటించింది. ఈ సినిమా పెద్ద సక్సెస్ అయ్యింది.

కానీ ఎందుకో ‘శ్రీమంతుడు’ సక్సెస్ కూడా ఈమెకు కలిసొచ్చింది లేదు. అవకాశాలు లేక సీరియల్స్ లో కూడా నటించడానికి ఈమె రెడీ అయ్యింది. కానీ.. అక్కడ కూడా ఈమెకు చేదు అనుభవమే ఎదురైంది అని చెప్పాలి. దీంతో సుకన్య మళ్ళీ రీ రీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటుంది. కేవలం సినిమాలు, సీరియల్స్ అనే కాదు.. ఓటీటీల కోసం రూపొందించే వెబ్ సిరీస్..లలో కూడా ఈమె నటించేందుకు రెడీగా ఉంది అని సమాచారం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus