Balayya Babu: బాలయ్య అభిమానులకు ఆ ఆనందం లేకుండా చేసిన ‘మైత్రి’

టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థల్లో ‘మైత్రీ మూవీ మేకర్స్’ సంస్థ ఒకటి. 2023 ఆరంభంలోనే ఈ సంస్థ చరిత్ర సృష్టించింది. చిరంజీవి, బాలకృష్ణ బడా స్టార్స్ తో నిర్మించిన సినిమాలను సంక్రాంతి పండుగకు ఒక్క రోజు గ్యాప్ లో విడుదల చేసి విజయాలు అందుకుని చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత రెండు మిడ్ రేంజ్ సినిమాలను కూడా విడుదల చేసింది కానీ అవి సక్సెస్ కాలేదు. ప్రస్తుతం బడా నిర్మాణ సంస్థల్లో నెంబర్ 1 ప్లేస్ లో ‘మైత్రి’ దూసుకుపోతోందని చెప్పొచ్చు.

అయితే ఎవ్వరూ ఊహించని విధంగా ఈ సంస్థకి ఇటీవల పెద్ద షాక్ తగిలినట్టైంది.విషయం ఏంటంటే ఇటీవల ఈ సంస్థ పై ఐటీ దాడులు జరిగాయి. ఏకంగా 5 రోజుల పాటు నాన్ స్టాప్ గా ఐటీ రైడ్స్ జరగడం గమనార్హం. ఈ సంస్థ వ్యాపార లావాదేవీలు, ఆదాయ పన్ను చెల్లింపుల్లో భారీ వ్యత్యాసం ఉన్నాయన్న సమాచారంతో కేంద్ర, రాష్ట్ర జీఎస్టీ.. ఐటీ అధికారులు మైత్రీ మూవీస్ కార్యాలయాల పై సోదాలు నిర్వహించడం జరిగింది.

‘మైత్రి’ సంస్థల అధినేతలైన నవీన్‌ యెర్నేని, యలమంచిలి రవిశంకర్‌ ఇళ్లల్లో కూడా ఐటీ రైడ్స్ జరిగాయి. అయితే ఈ రైడ్స్ వల్ల బాలకృష్ణ ఫ్యాన్స్ కు కూడా పెద్ద షాక్ తగిలినట్టైంది. ఎందుకంటే వీర సింహా రెడ్డి వంద రోజులు సెలబ్రేషన్స్ ను ఏప్రిల్ 23న నిర్వహిస్తామని ఈ సంస్థ ప్రకటించింది. కానీ అలాంటిదేమి నిర్వహించలేదు.ఈరోజుల్లో ఓ సినిమాకి వందరోజులు పండగ జరపడం అంటే మామూలు విషయం కాదు. (Balayya Babu) ‘వీర సింహారెడ్డి’ చిత్రం 8 కేంద్రాల్లో 100 రోజులు ఆడటం జరిగింది.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus