బోయపాటికి బాలయ్య ఫ్యాన్స్ సీరియస్ రిక్వెస్ట్..!

  • January 6, 2020 / 06:14 PM IST

నటసింహం బాలయ్యకు 2019 సంవత్సరం చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. గత ఏడాది ఆయన నటించిన మూడు సినిమాలు ఘోరపరాజయం చవిచూశాయి. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా బాలకృష్ణ తన తండ్రిగారైన ఎన్టీఆర్ గారి బయో పిక్ తీశారు. ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు పేరుతో విడుదలైన ఈ రెండు చిత్రాలు పరాజయం పొందాయి. టాలీవుడ్ లోని స్టార్ క్యాస్ట్ తో భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఆ రెండు చిత్రాలు బడ్జెట్ లో మూడో వంతు వసూళ్ళు కూడా సాధించలేక ట్రిపుల్ డిజాస్టర్ గా నిలిచాయి.ఇక బాలయ్యకు జై సింహ వంటి హిట్ ఇచ్చిన దర్శకుడు కె ఎస్ రవికుమార్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ రూలర్ కూడా ప్లాప్ గా నిలిచింది.

ఒకప్పుడు ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన టాలీవుడ్ టాప్ హీరో బాలయ్య చిత్రాలు కనీసం కుర్ర హీరోల సినిమాలకు వచ్చే కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోవడం, ఆయన మార్కెట్ ఏ స్థాయిలో దెబ్బతిందో తెలియజేస్తుంది. బాలయ్య హార్డ్ కోర్ అభిమానులకు ఈ పరిణామాలు మింగుడు పడటం లేదు. తమ అభిమాన హీరోకు ఎదురవుతున్న వరుస పరాభవాలు వారిని ఇబ్బంది పెడుతున్నాయి. ఒకప్పుడు బాలయ్య ఫ్యాన్ అని కాలర్ ఎగరేసుకొని తిరిగిన వారు, మొహం చాటేస్తున్నారు. కానీ ఒక సరైన సబ్జెక్టు దొరికితే బాలయ్య రికార్డుల మోత మొదలవడం ఖాయం అని ఫ్యాన్స్ గట్టిగా విశ్వసిస్తున్నారు. అందుకే వారి ఆశలన్నీ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న చిత్రంపై పెట్టుకున్నారు.

బాలయ్య-బోయపాటిది సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహ, లెజెండ్ చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ దశాబ్డంలో బాలయ్య కొట్టిన క్లీన్ హిట్ చిత్రాలు కూడా ఇవి రెండే. అందుకే అభిమానులు బోయపాటిపై ఒత్తిడి పెంచేస్తున్నారట. బాలయ్య ఇమేజ్ కి సరిపోయేలా అవుట్ అండ్ అవుట్ మాస్ సబ్జెక్టు తో శ్రద్దగా సినిమా తీసి వారి దాహం తీర్చాలని విన్నపాలు చేస్తున్నారట. మాస్ చిత్రాల దర్శకుడిగా పేరున్న బోయపాటి బాలయ్యకు సూపర్ హిట్ ఇచ్చి ఫ్యాన్స్ తలెత్తుకొనేలా చేస్తాడో లేదో చూడాలి.

అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus