‘సరైనోడు’ చిత్రం తర్వాత అల్లు అర్జున్ కు సరైన హిట్టు పడలేదు. ‘దువ్వాడ జగన్నాథం’,’నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ వంటి చిత్రాలు ఆశించిన స్థాయిలో హిట్ అవ్వలేదు. ఇలాంటి తరుణంలో నెక్స్ట్ సినిమా చెయ్యడానికి బన్నీ చాలా టైం తీసుకున్నాడు. అలాంటి టైములో తనకి ‘జులాయి’ ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ వంటి రెండు హిట్లిచ్చిన దర్శకుడు త్రివిక్రమ్ తో ‘అల వైకుంఠపురములో’ సినిమా చెయ్యడానికి ఓకే చెప్పాడు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం రికార్డు కలెక్షన్లను సాధించింది.
దాంతో వీరి కాంబినేషన్ కు హ్యాట్రిక్ కంప్లీట్ అయ్యింది.అంతేకాదు తిరిగి హిట్ అందుకుని ఫ్యాన్స్ ను కూడా సంతోషపెట్టాడు. ఇక బాలయ్య కూడా బన్నీ ఫార్ములానే అప్లై చేస్తున్నాడని తెలుస్తుంది. విషయం ఏమిటంటే.. బాలకృష్ణ కు ‘లెజెండ్’ చిత్రం తరువాత సరైన హిట్టు అందుకోలేకపోయాడు. తరువాత వచ్చిన ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ ‘జై సింహా’ చిత్రాలు పర్వాలేదు అని అనిపించినా.. ‘లయన్’ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ ‘రూలర్’ వంటి చిత్రాలు డిజాస్టర్లు అయ్యాయి.
దీంతో ఎలాగైనా హిట్టు కొట్టాలని బోయపాటి శ్రీను డైరెక్షన్లో సినిమా చెయ్యడానికి ఓకే చెప్పాడు బాలయ్య. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ‘సింహా’ ‘లెజెండ్’ వంటి చిత్రాలు సూపర్ హిట్లు అయ్యాయి. దాంతో ‘ఈసారి వీరిద్దరూ కలిసి చెయ్యబోయే చిత్రం బ్లాక్ బస్టర్ అవుతుంది.. హ్యాట్రిక్ కంప్లీట్ చేస్తారు’ అని అభిమానులు ఆశిస్తున్నారు.ఈసారి హిట్ అందుకుని బన్నీ లానే బాలయ్య కూడా తిరిగి హిట్ కొట్టి ఫామ్లోకి వస్తాడేమో చూడాలి.
Most Recommended Video
పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్
మీ అభిమాన తారల, అరుదైన పెళ్లి పత్రికలు
ఐశ్వర్యవంతులను పెళ్లి చేసుకున్న అందమైన హీరోయిన్స్!