మీ అభిమాన తారల, అరుదైన పెళ్లి పత్రికలు

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అరుదైన, అందమైన ఘట్టం. మన జీవితంలోకి ఓ శాశ్వత బంధానికి స్వాగతం పలికే అద్భుత కార్యం. హిందూ సాంప్రదాయంలో విశిష్ట స్థానం కలిగిన ఈ పవిత్ర కార్యాన్ని బంధు మిత్రుల సమక్షములో ఉన్నంతలో ఘనంగా చేసుకోవాలని అందరూ ఆశపడతారు.

ఆ బంధు మిత్రలకు ఆహ్వాన లేఖ… పెళ్లి పత్రికకు ఉన్న ప్రాముఖ్యతే వేరు. అయినవారందరినీ ఇంటికి పిలిచే.. ఆహ్వాన పత్రిక ఎలా ఉండాలి.. ఎంత ఖరీదులో ఉండాలి అనే విషయాలలో కుటుంబ సభ్యుల మధ్య జరిగే చర్చలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఇక కొత్త కార్డులు వచ్చిన వెంటనే కుటుంబ సభ్యులంతా చేరి పసుపు అత్తరు రాసి బంధువులు, స్నేహితుల ఇళ్లకు బయలుదేరుతారు.

సామాన్యులే పెళ్లి పత్రిక విషయంలో ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. మరి స్టార్ లు తన పెళ్లి కార్డు విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారు.. ఎంత అందంగా డిజైన్ చేయిస్తారు. కొందరు టాలీవుడ్ స్టార్ హీరోల శుభలేఖలు మీ కోసం సేకరించడం జరిగింది. ఆ అరుదైన పెళ్లి కార్డులు ఎవరివో చూసేద్దామా..

జూనియర్ ఎన్టీఆర్-లక్ష్మీ ప్రణతి

ఇక్కడ మీరు చూస్తున్న శుభలేఖ..జూనియర్ ఎన్టీఆర్-లక్ష్మీ ప్రణీతలది. సింగిల్ కలర్ కార్డులో అందమైన పూల దండ బోర్డర్ లో చక్కగా ఉంది. వ్యాపారవేత్త అయిన నార్నె శ్రీనివాసరావు కుమార్తె లక్ష్మీ ప్రణతి ని ఎన్టీఆర్ మే 5, 2011లో వివాహం చేసుకున్నారు. ఈమె ఎన్టీఆర్ బంధువుల అమ్మాయి కావడం విశేషం.

రామ్ చరణ్- ఉపాసన

మెగాస్టార్ వారసుడు చరణ్-ఉపాసనల పెళ్లి పత్రిక ఇదే. వైట్ బ్యాక్ గ్రౌండ్ గోల్డ్ బోర్డ్ తో ఉన్న ఈ పెళ్లి పత్రికలో రామ్ చరణ్ పేరును తలపిస్తూ కే సి అనే లోగో గమనించవచ్చు. దోమకొండ ఆస్థాన వారసురాలైన అనిల్ కామినేని కూతురు ఉపాసను చరణ్ ప్రేమ వివాహం చేసుకున్నారు.

అల్లు అర్జున్-స్నేహ రెడ్డి

అల్లు వారి అబ్బాయి అల్లు అర్జున్-స్నేహ రెడ్డి పెళ్లి పత్రిక చూశారుగా..సింపుల్ గా కనిపించే కార్డులో ఖరీదైన స్వీట్స్ తో పాటు బంధువులను ఆహ్వానించారు. సిట్ ఇంజనీరింగ్ కాలేజ్ అధిపతి అయిన శేఖర్ రెడ్డి కుమార్తెనే స్నేహ రెడ్డి. వీరి నేటివ్ వరంగల్. 2011 మార్చ్ 6న బన్నీ, స్నేహ రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నారు.

మంచు మనోజ్-ప్రణతి

రెడ్ అండ్ బ్లూ బ్రైట్ కలర్స్ పై గోల్డ్ అండ్ వైట్ ఫాంట్ తో అధ్బుతంగా ఉన్న ఈ శుభలేఖ మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ – ప్రణతిలది. మంచు మనోజ్ తన ప్రేయసి ప్రణతి రెడ్డిని 2015 మే 20న వివాహం చేసుకున్నారు. ఐతే వీరిద్దరూ గత ఏడాది విడాకులు తీసుకున్నారు.

నాగ చైతన్య-సమంత

బేబీ బ్లూ కలర్ లో అందమైన డిజైన్ తో ఉన్న ఈ వెడ్డింగ్ కార్డు చైతూ-సమంతలది. ఈ ప్రేమ జంట 2017లో గోవాలో ఘనంగా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. 2017 అక్టోబర్ 6 మరియు 7తారీఖులలో హిందూ మరియు క్రిస్టియన్ సంప్రదాయాలలో వీరి పెళ్లి జరిగింది.

గోపీచంద్-రేష్మా

ఎల్లో కలర్ బ్యాక్ గ్రౌండ్ కలిగి పైన దర్శకుడు లేట్ తొట్టెంపూడి కృష్ణ గారి ఫోటోతో ఉన్న ఈ ఆహ్వాన పత్రిక హీరో గోపిచంద్-రేష్మాలది. గోపిచంద్ హీరో శ్రీకాంత్ మేనకోడలైన రేష్మా ను 2013 మే 12న వివాహం చేసుకున్నారు.

నరేష్-విరూప

అచ్చమైన తెలుగులో అందంగా కనిపిస్తున్న ఈ పెళ్లి పత్రిక మన అల్లరి హీరో నరేష్ ది. అల్లరి నరేష్ కంఠమనేని రామకృష్ణ గారి కూతురైన విరూపను 2015 మే 29న వివాహం చేసుకున్నారు.

ప్రియమణి-ముస్తఫా రాజ్

ఇక ఇక్కడ కనిపిస్తున్న రిసెప్షన్ కార్డు హీరోయిన్ ప్రియమణి మరియు ముస్తఫా రాజ్ లది. ప్రియమణి 2017 ఆగష్టు 23 న ముస్టాఫా రాజ్ ని వివాహం చేసుకున్నారు. వీరి రిసెప్షన్ 24న జరిగింది.

డైరెక్టర్ క్రిష్- రమ్య

సాంప్రదాయ పెళ్లి పత్రికకు భిన్నంగా ఆహ్వాన పత్రికను అందమైన వివరణతో మలచిన ఈ అచ్చ తెలుగు శుభలేఖ డైరెక్టర్ క్రిష్-రమ్యలది. వెలగ వెంకట రమణ ప్రసాద్ కూతురు రమ్యను క్రిష్ 2016 ఆగస్టు 7వ తేదీన పెళ్లి చేసుకున్నారు. ఐతే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.

వరుణ్ – వితిక

చుట్టూ అందమైన బోర్డర్, పైన పార్వతి పరమేశ్వరుల బొమ్మతో అందంగా ఉన్న ఈ శుభలేఖ హీరో వరుణ్-వితిక లది. హీరోయిన్ షేరు వితికను వరుణ్ 2016 ఆగస్టు 18న పెళ్లి చేసుకున్నాడు.

చిరంజీవి-సురేఖ

మీకోసం అద్భుతమైన, అరుదైన రెండు శుభలేఖలు చివరి వరకు దాచి ఉంచడం జరిగింది. అదే చిరంజీవి-సురేఖ పెళ్లి నాటి శుభలేఖ. స్వర్గీయ అల్లు రామలింగయ్య తన కూతురు సురేఖను చిరంజీవికి ఇచ్చి పెళ్లి చేయ తలచి ఈ ఆహ్వాన పత్రిక వేయించారు. కొణిదెల వెంకట్రావు కుమారుడు చిరంజీవి, అల్లు సురేఖను 1980 ఫిబ్రవరి 20న వివాహం చేసుకున్నారు.

నందమూరి తారకరామారావు-బసవ తారకం

మీరు చూస్తున్న ఈ శుభలేఖ అక్షరాలా 78ఏళ్ల నాటిది. అది కూడా వెండితెర ఇలవేల్పు నందమూరి తారకరామారావు-బసవ తారకం పెళ్లి పత్రిక. నందమూరి రామయ్య చౌదరి కుమారుడు నందమూరి తారకరామారావు కి కాట్రగడ్డ చెంచయ్య కుమార్తె బసవతారకం ని ఇచ్చి మే 2, 1942లో వివాహం చేశారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus