ఐశ్వర్యవంతులను పెళ్లి చేసుకున్న అందమైన హీరోయిన్స్!

చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా రాణించడం అంత సులభం ఏమి కాదు. ఎంత టాలెంటెడ్ ఉన్నా అనేక సవాళ్ళను ఎదురుకోవాల్సి వస్తుంది. కొందరు అన్ని ఒడిదుదుడుకులు ఎదుర్కొని పరిశ్రమలో నిలబడతారు. మరి కొందరు మధ్యలోనే తమ కెరీర్ ముగించాల్సి పరిస్థితి ఏర్పడుతుంది. ఐతే వెండి తెరపై వెలిగిన అందమైన తారలకు ఓ అడ్వాంటేజ్ ఉంది. వారి అందం ఫేమ్ రీత్యా ఆల్రెడీ జీవితంలో బాగా సెటిల్ అయిన వ్యాపారవేత్తలు, ప్రముఖులు పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తారు. అనేక మంది బ్యూటిఫుల్ హీరోయిన్స్ ధనవంతులను భర్తలు గా చేసుకున్నారు. మరి వారెవరో ఇప్పుడు చూద్దాం..

మాధవి

80లలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన మాధవి గురించి తెలియని వారుండరు. స్వతహాగా ప్రొఫెనల్ డాన్సర్ అయిన మాధవి మంచి ఫార్మ్ లో ఉన్నప్పుడే తాను నమ్మే స్వామి రామ ఆశ్రమంలో రాల్ఫ్ శర్మను కలుసుకోవడం జరిగింది. ఆ స్వామిజీ ఆదేశాల మేరకు వ్యాపార వేత్త అయిన రాల్ఫ్ శర్మను వివాహం చేసుకుంది. హిందూ తండ్రి, జర్మన్ మదర్ కి పుట్టిన రాల్ఫ్ శర్మ ఓ ఫార్మా కంపెనీ ఓనర్ అని సమాచారం.

శిల్పా శెట్టి

 

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన శిల్పా శెట్టి సినిమాలలో అవకాశాలు తగ్గిన వెంటనే బ్రిటిష్ వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకున్నారు. అనేక వ్యాపారాలు కలిగిన రాజ్ కుంద్రా ఆస్థి విలువ దాదాపు 2000కోట్ల పై మాటే. 2009లో వీరి వివాహం జరుగగా ఇద్దరు సంతానం ఉన్నారు. మొదట వివాహంలో కవిత కుంద్రా ను పెళ్లి చేసుకున్న ఆయన విడాకుల అనంతరం శిల్పా శెట్టిని పెళ్లి చేసున్నారు.

విద్యాబాలన్

సౌత్ ఇండియా మూలాలు కలిగిన విద్యా బాలన్ బాలీవుడ్ లో అనేక చిత్రాలు చేసింది. కెరీర్ బిగినింగ్ నుండి ఎక్స్ పోజ్ చేయని విద్యాబాలన్.. సిల్క్ స్మిత బయోపిక్ డర్టీ పిక్చర్ లో రెచ్చిపోయి నటించి అందరినీ ఆశ్చర్య పరిచింది. కాగా విద్యాబాలన్ ఓ నిర్మాతను పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోయారు. యూటీవీ మోషన్స్ పిక్చర్ అధినేత ఆదిత్య రాయ్ కపూర్ తో డేటింగ్ లో ఉన్నానన్న విద్యా బాలన్.. 2012లో ఆయన్ని వివాహం చేసుకుంది.

అయేషా టకియా

2005లో డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ సూపర్ సినిమాలో నటించిన అయేషా టకియా సైతం ముంబైకి చెందిన ఓ వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుంది. 2009లో వ్యాపార వేత్త ఫర్హాన్ ఆజ్మి ని పెళ్లి చేసుకున్నారు.వీరికి ఒక సంతానం కూడా ఉంది.

సోనమ్ కపూర్

బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ హీరోయిన్ గా అనేక సినిమాలలో నటించింది. ఈమె ముంబై లో పెద్ద వ్యాపార వేత్తగా పేరున్న ఆనంద్ అహుజాను 2018లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అయిన తర్వాత కూడా ఆమె సినిమాలలో నటిస్తుంది. అది వారిద్దరి మధ్య ఒప్పందం అని తెలుస్తుంది.

అనుష్క శర్మ

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి తన అందంతో స్టార్ క్రికెటర్ మరియు ఇండియా టీం కెప్టెన్ విరాట్ కోహ్లీని పడవేసింది. చాలా కాలం బహిరంగంగా ప్రేమికులుగా తిరిగిన ఈ జంట 2017లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. సూపర్ ఫార్మ్ బ్యాట్స్ మెన్ గా అనేక రికార్డ్స్ నెలకొల్పిన విరాట్ సంపాదన ఏడాదికి వందల కోట్లలోనే. ఆ విధంగా స్టార్ క్రికెటర్ ని పెళ్ళాడి ఆమె లైఫ్ కి తిరుగు లేదని నిరూపించుకున్నారు.

అసిన్

డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెలుగు పరిశ్రమకు పరిచయం చేసిన హీరోయిన్స్ లో అసిన్ ఒకరు. అమ్మ నాన్న తమిళ అమ్మాయి, శివమణి, లక్ష్మీ నరసింహ వంటి హిట్ చిత్రాలలో ఆమె నటించింది. స్టార్ హీరోయిన్ గా సౌత్ లో పలు సినిమాలు చేసిన అసిన్, ప్రముఖ కంపెనీ మైక్రో మాక్స్ సహ వ్యవస్థాపకుడు అయిన రాహుల్ శర్మను 2016లో వివాహం చేసుకుంది. వీరి వివాహం హిందూ మరియు క్రిస్టియన్ సాంప్రదాయంలో జరిగింది.

రాణి ముఖర్జీ

బాలీవుడ్ లో బోల్డ్ రోల్స్, ఆటిట్యూడ్ తో పేరు తెచ్చుకున్న హీరోయిన్ రాణి ముఖర్జీ బాలీవుడ్ బడా నిర్మాత ఆదిత్య చోప్రాను వివాహం చేసున్నారు. పాయల్ ఖన్నాను మొదటి వివాహం చేసుకున్న ఆయన 2009లో ఆమెకు విడాకులు ఇచ్చి 2014లో రెండో వివాహంగా రాణి ముఖర్జీని చేసుకున్నారు. బాలీవుడ్ లో యష్ రాజ్ ఫిల్మ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

జూహీ చావ్లా

ఒకప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చలామణి అయిన జూహీ చావ్లా వ్యాపార వేత్తగా పలు దేశాలలో కార్యకలాపాలు సాగించే జై మెహతర్ ని పెళ్లి చేసుకున్నారు.ఈయన ఆస్థుల విలువ వేల కోట్లలోనే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus