బాలయ్య బోయపాటి మూవీలో హీరోయిన్స్ వాళ్లేనట..?

  • February 7, 2020 / 05:47 PM IST

బాలయ్య బోయపాటిలది సూపర్ హిట్ కాంబినేషన్. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక ఈ ఇద్దరు ముచ్చటగా మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యే ఈమూవీ రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీపై భారీ అంచనాలున్నాయి. బాలయ్య గత ఏడాది వరుస పరాజయాలు చవిచూసిన నేపథ్యంలో ఫ్యాన్స్ ఈ చిత్రం పై భారీ ఆశలు పెట్టుకున్నారు. అలాగే లెజెండ్ మూవీ తరువాత బాలయ్య ఆ స్థాయి హిట్ కూడా అందుకోలేదు. వీటన్నింటికి ఈ సినిమాతో సమాధానం చెప్పాలని వారు భావిస్తున్నారు.

కాగా ఈ మూవీలో హీరోయిన్స్ గురించి ఆసక్తికర వార్త ఒకటి బయటికి వచ్చింది. బాలయ్య సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించే అవకాశం ఉండగా శ్రీయా మరియు నయనతార నటిస్తారని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే వీరిద్దరితో దర్శక నిర్మాతల సంప్రదింపులు కూడా జరిగాయని తెలుస్తుంది. గతంలో శ్రీయా బాలయ్య పలు చిత్రాలలో కలిసి నటించారు. చెన్నకేశవ రెడ్డి, గౌతమీ పుత్రశాతకర్ణి, పైసా వసూల్ చిత్రాలలో వీరు కలిసి నటించారు. ఇక నయనతార సైతం సింహా, శ్రీ రామరాజ్యం వంటి సినిమాలలో బాలయ్య కి జంటగా నటించారు. మళ్ళీ మరో మారు ఈ ఇద్దరు భామలు బాలయ్యకి జోడిగా రానున్నారట.

Most Recommended Video

జాను సినిమా రివ్యూ & రేటింగ్!
అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు
ఎన్టీఆర్ ఆస్తుల వివరాలు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus