Jr NTR: ఎన్టీఆర్ లగ్జరీ లైఫ్.. చూస్తే మతి పోవాల్సిందే!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రంలో రాంచరణ్ కూడా మరో హీరోగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక ‘ఆర్.ఆర్.ఆర్’ పూర్తవ్వగానే త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు ఎన్టీఆర్. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కబోతున్నట్టు సమాచారం. ఆగష్టు నుండీ ఈ ప్రాజెక్ట్ మొదలుకాబోతున్నట్టు సమాచారం. ఇది ఎన్టీఆర్ కి 30 వ చిత్రం. 2021 సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఇది పక్కన పెడితే.. ఎన్టీఆర్ ఒక్కో సినిమాకి 20 కోట్లు పారితోషికం తీసుకుంటాడన్న సంగతి తెలిసిందే. అయితే ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి 25 కోట్ల వరకూ అందుకున్నట్టు భోగట్టా. ఎన్టీఆర్ లగ్జరీ లైఫ్ స్టైల్ చూస్తే మాత్రం ఎవ్వరికైనా మతి పోవాల్సిందే. ముఖ్యంగా ఎన్టీఆర్ కు వాచ్ లు అన్నా.. కార్లు అనా మహా ఇష్టమట. ఎన్టీఆర్ వాడే ఖరీదైన కార్లు.. వాచ్ ల పై ఓ లుక్కేద్దాం రండి.

1) ఎన్టీఆర్ వాడే ‘ఆడమస్ ఫైగస్ట్ ఓక్ ఆఫ్షోర్ ఆంపైర్’ వాచ్ ధర అక్షరాల 19 లక్షలు

2) ‘ఆడమస్ ఫైగస్ట్ ఓక్ ఆఫ్షోర్ ఫోర్జ్డ్ కార్బన్ ‘ అనే రెండో వాచ్ 20 లక్షలు పైనే..!

3) ‘బివిఎల్ గరి బై రిట్రో స్టీల్ సెర్మైక్’ అనే వాచ్ ధర 7 లక్షల 12 వేలు

4) ‘పనెరై లుమినర్ సబ్ మెర్స బుల్’ వాచ్ ధర 5 లక్షలు

5) రాజమౌళి కొడుకు.. కార్తికేయ పెళ్ళికి వెళ్ళినప్పుడు.. ఎన్టీఆర్ చేతికి ఉన్న వాచ్ ధర అక్షరాల… 2 కోట్ల 20 లక్షలట.

6) ఇక ‘ఎన్టీఆర్ వాడే పోర్స్చ్ 911’ కారు ధర కోటిన్నరకు పైనే..!

7) ఇక మరో రేంజ్ రోవర్ లేటెస్ట్ మోడల్ కారు 2.5 కోట్లు

8) మరో కారు ‘బెంజ్ 4 మెటిక్’ ధర కోటి ఇరవై లక్షలు

9) ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ ఉంటున్న ఇంటి ఖరీదు 50 కోట్లు

10) ఇదిలా ఉండగా ఎన్టీఆర్ కొన్ని యాడ్స్ కూడా చేస్తాడన్న సంగతి తెలిసిందే. ఒక్కో యాడ్ కు కోటిన్నర వరకూ తీసుకుంటాడని సమాచారం.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus