‘కింగ్’ నాగార్జున,యువసామ్రాట్ నాగ చైతన్య హీరోలుగా రమ్య కృష్ణ, కృతి శెట్టి.. హీరోయిన్లుగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బంగార్రాజు’. ‘జీ స్టూడియోస్’ ‘అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్’ బ్యానర్లు కలిసి నిర్మించిన ఈ చిత్రం 2016లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘సోగ్గాడే చిన్ని నాయన’ కి సీక్వెల్ గా తెరకెక్కింది.జనవరి 14న సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదలయ్యింది.కాస్త రొటీన్ గా అనిపించినా మొత్తానికి బాగానే ఉంది అనే టాక్ ను ఈ సినిమా సంపాదించుకుంది.
అయితే కలెక్షన్ల పరంగా ఈ చిత్రం దూసుకుపోతుంది. మొదటి రోజుతో సమానంగా 3వ రోజున భారీగా రాబట్టిన ఈ చిత్రం రాబట్టింది.ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లను ఓ సారి గమనిస్తే :
నైజాం | 6.65 cr |
సీడెడ్ | 5.45 cr |
ఉత్తరాంధ్ర | 2.80 cr |
ఈస్ట్ | 2.55 cr |
వెస్ట్ | 1.87 cr |
గుంటూరు | 2.35 cr |
కృష్ణా | 1.43 cr |
నెల్లూరు | 1.15 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 24.25 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 2.75 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 27.00 cr |
‘బంగార్రాజు’ చిత్రానికి రూ.38.31 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.39 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 3 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.27 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.12 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. పండుగ వీకెండ్ ను ఈ చిత్రం బాగానే క్యాష్ చేసుకుంది. అయితే ఈరోజు నుండీ ఈ చిత్రం పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలి.
వీక్ డేస్ లో స్టడీగా రాబడితే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఈజీ అవుతుంది. ఇదిలా ఉండగా.. నైజాం లో ఈ చిత్రం పెర్ఫార్మెన్స్ వీక్ గా ఉంది. బహుశా.. పండుగ వలన ప్రేక్షకులు ఊర్లు వెళ్ళడం వలన అయ్యి ఉండొచ్చు. నైజాం లో ఈ చిత్రం ఇంకో 5 కోట్ల వరకు వసూలు చేయాల్సి ఉంది.
Most Recommended Video
ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!