Beast Collections: ఇక్కడ ఓకె అక్కడి సంగతెలా ఉంటుందో..!

Advertisement

తమిళ స్టార్ కథానాయకుడు విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘బీస్ట్’. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసారు. ఏప్రిల్ 13న అంటే ఈరోజు విడుదలైన ఈ చిత్రానికి మొదటి షో నుండే నెగిటివ్ టాక్ వచ్చింది. తమిళ్ లో ఎలా ఉన్నా తెలుగులో అయితే ఈ చిత్రానికి ముందు నుండీ మంచి బజ్ ఉంది. తమిళ్ లో కంటే తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణలో ‘బీస్ట్’ కు ఎక్కువ టికెట్ రేట్లు ఉన్నాయి కాబట్టి ఈ మూవీకి చాలా ప్లస్ అయ్యింది.

Click Here To Watch NOW

విజయ్ గత చిత్రం ‘మాస్టర్’ కూడా తెలుగులో బాగా కలెక్ట్ చేసింది. ఆ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఇక్కడి బయ్యర్స్ కు లాభాల్ని అందించింది. పైగా ‘బీస్ట్’ లో మొదటి పాట ‘అరబిక్ కుత్తు’ కూడా పెద్ద హిట్ అవ్వడం, ‘బీస్ట్’ దర్శకుడు నెల్సన్ తెరకెక్కించిన ‘డాక్టర్’ కూడా సూపర్ హిట్ అవ్వడంతో ఈ మూవీ పై ఓ రేంజ్లో హైప్ ఏర్పడింది. దీంతో ఇక్కడ రూ.10.7 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇదిలా ఉండగా..

తొలిరోజు ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఓపెనింగ్స్ మాత్రం అదిరిపోయాయనే చెప్పాలి. తొలి రోజు బీస్ట్ రూ.4.2 కోట్ల వరకు షేర్ ను రాబట్టొచ్చు అనేది అంచనా. ఈ లెక్క ఇంకా పెరిగినా ఆశ్చర్యపడనవసరం లేదు. ఇక ప్రపంచవ్యాప్తంగా.. రూ.75 కోట్ల వరకు గ్రాస్ వసూళ్ళను రాబట్టొచ్చనేది అంచనా. అయితే రెండో రోజుకి మాత్రం అడ్వాన్స్ బుకింగ్స్ చాలా డల్ గా ఉన్నాయి. అందుకు ప్రధాన కారణం ‘కె.జి.ఎఫ్2’ రిలీజ్ కావడం వలెనే అని తెలుస్తుంది.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus