సినిమాకి ప్లస్ అవుతారనుకొంటే.. లేట్ అవ్వడానికి కారణమయ్యారు

బాహుబలి, సాహో తర్వాత వరల్డ్ వైడ్ ఆడియన్స్ అందరూ వెయిట్ చేస్తున్న తెలుగు సినిమా “ఆర్ ఆర్ ఆర్”. రాజమౌళి దర్శకత్వంలో 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని జూలై 30, 2020లో విడుదల చేయాలనేది రాజమౌళి ప్లాన్. అయితే.. తొలుత చరణ్, ఎన్టీఆర్ ల గాయాల వల్ల షూటింగ్ డిలే అవ్వగా.. అనంతరం ఆలియా భట్ డేట్స్ దొరక్క పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఇప్పుడు అజయ్ దేవగన్ కారణంగా మళ్ళీ షూటింగ్ లేట్ అవుతోంది.

is-there-any-update-on-aug15th-from-rrr-movie1

ఆలియా భట్, అజయ్ దేవగన్ ల బల్క్ డేట్స్ ను సంపాదించడానికి నిర్మాత దానయ్య నానా పాట్లు పడుతున్నారు. వీళ్ళద్దరి షూటింగ్ ను సింగిల్ షెడ్యూల్ లో ముగించాలన్నది రాజమౌళి ప్లాన్. అయితే.. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో యమ బిజీగా ఉన్న ఆలియా, అజయ్ దేవగన్ ల డేట్స్ దొరకడం లేదు. దాంతో “ఆర్ ఆర్ ఆర్”ను 2021 జనవరికి పోస్ట్ పోన్ చేద్దామనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. సొ, అలా పోస్ట్ పోన్ అవ్వడం అనేది జరిగితే గనుక అందుకు కారణం ఆలియా, అజయ్ దేవగన్.

రాజుగారి గది 3 సినిమా రివ్యూ & రేటింగ్!
ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus