అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు, టాలీవుడ్ హీరో అయినటువంటి బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Sreenivas) త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు అని 3 రోజుల క్రితమే ఫిల్మీ ఫోకస్ రివీల్ చేయడం జరిగింది.
కానీ శ్రీనివాస్ పెళ్లాడబోయే అమ్మాయి పేరు బయటకు రాలేదు. మొత్తానికి అనుకున్నట్టుగానే నిన్న సైలెంట్ గా ఎంగేజ్మెంట్(రోకా ఫంక్షన్) చేసుకుని అందరినీ సర్ప్రైజ్ చేశాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్.
హైదరాబాద్‌కు చెందిన కావ్య రెడ్డితో ఆదివారం నాడు ఈ శ్రీనివాస్ నిశ్చితార్థం అత్యంత వైభవంగా జరిగింది.కావ్య రెడ్డి, శ్రీనివాస్ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారని టాక్ వినిపించింది.ఇరు కుటుంబ సభ్యులకి విషయం తెలిపి.. వారి అంగీకారంతోనే పెళ్ళికి రెడీ అయ్యారని కూడా అర్దం చేసుకోవచ్చు.
కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ఇక శ్రీనివాస్, కావ్య రెడ్డి..ల ఎంగేజ్మెంట్ వేడుకకు సినీ పరిశ్రమకి చెందిన కొంతమంది స్టార్స్ కూడా సందడి చేశారు.
వీరిలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ని లాంచ్ చేసిన దర్శకుడు వి.వి.వినాయక్, దర్శకుడు బోయపాటి శ్రీను, హీరోయిన్ సంయుక్త మీనన్, దర్శకుడు అనిల్ రావిపూడి, దర్శకుడు గోపిచంద్ మలినేని వంటి వారు హాజరయ్యి… కాబోయే వధూవరులకి తమ బెస్ట్ విషెస్ ను తెలియజేశారు.
ఈ విషయాలు పక్కన పెట్టేసి.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డి..ల ఎంగేజ్మెంట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కెయండి :