Sai Sreenivas: బెల్లంకొండ కొత్త సినిమాకు సూపర్ టైటిల్ ఫిక్స్.. టైటిల్ ఇదే!

  • September 14, 2024 / 06:01 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ తో సంబంధం లేకుండా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న నటులలో బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) ఒకరు కాగా రాక్షసుడు మూవీ తర్వాత ఈ హీరోకు ఆ రేంజ్ సక్సెస్ ను సొంతం చేసుకోలేదు. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన గరుడన్ రీమేక్ లో బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తుండగా ఈ సినిమాకు మొదట గరుడ అనే టైటిల్ ను పరిశీలించారట. అయితే ఆ టైటిల్ ఇప్పటికే రిజిష్టర్ కావడంతో ఈ సినిమాకు వీర ధీర శూర అనే టైటిల్ ను ఫైనల్ చేశారట.

Sai Sreenivas

మంచు మనోజ్ (Manchu Manoj) , నారా రోహిత్ (Nara Rohit) కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మనోజ్ ఈ సినిమాలో విలన్ రోల్ లో నటిస్తున్నారని ప్రచారం జరగగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమాతో పాటు పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. ఈ హీరో సినిమాలు ఒకింత భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతున్నాయి.

బెల్లంకొండ శ్రీనివాస్ భవిష్యత్తు ప్రాజెక్టుల రిలీజ్ డేట్లకు సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది. బెల్లంకొండ శ్రీనివాస్ రెమ్యునరేషన్ పరిమితంగానే ఉండగా పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ సాధించాలని ఈ హీరో భావిస్తున్నారు. బెల్లంకొండ భవిష్యత్తు సినిమాలలో ఏ సినిమాతో పాన్ ఇండియా హిట్ దక్కుతుందో చూడాల్సి ఉంది.

బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేసి లక్ పరీక్షించుకోగా ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. బెల్లంకొండ శ్రీనివాస్ తన సినిమాలతో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. పాన్ ఇండియా డైరెక్టర్ల డైరెక్షన్ లో బెల్లంకొండ శ్రీనివాస్ నటించాలని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరోసారి ఆశ్చర్యపరిచిన మలయాళ సినిమా.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus