Bellamkonda Sreenivas: ఆ పాత్రనే నమ్ముకున్న బెల్లంకొండ శ్రీనివాస్.. భారీ హిట్ దక్కుతుందా?

స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ (Balakrishna)  అఖండ (Akhanda)  సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అఘోరా పాత్రలో బాలయ్య నట విశ్వరూపం చూపించారనే చెప్పాలి. విశ్వక్ సేన్ (Vishwak Sen) సైతం గామి (Gaami) సినిమాతో అఘోరా పాత్రలో కనిపించి తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. అయితే బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) సైతం అదే తరహా పాత్రను ఎంచుకున్నారని తెలుస్తోంది. కెరీర్ పరంగా వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న బెల్లంకొండ శ్రీనివాస్ లుధీర్ అనే కొత్త డైరెక్టర్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించనున్నారు.

హైందవ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కనుందని సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ అఘోరాగా కనిపిస్తారని భోగట్టా. సినిమా మొత్తం శ్రీనివాస్ ఇదే తరహా పాత్రలో కనిపిస్తారో లేక కొన్ని నిమిషాల పాటు కనిపిస్తారో తెలియాల్సి ఉంది. బెల్లంకొండ శ్రీనివాస్ రెమ్యునరేషన్ ఒకింత పరిమితంగానే ఉందని సమాచారం అందుతోంది. బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం సాగర్ కె చంద్ర (Saagar K. Chandra) డైరెక్షన్ లో ఒక సినిమాలో, కౌశిక్ పెగళ్లపాటి డైరెక్షన్ లో మరో సినిమాలో నటించనున్నారని తెలుస్తోంది.

అల్లుడు అదుర్స్ (Alludu Adhurs) , ఛత్రపతి (Chatrapathi) రీమేక్ సినిమాలతో బెల్లంకొండ శ్రీనివాస్ లకు భారీ షాకులు తగలడం గమనార్హం. బెల్లంకొండ శ్రీనివాస్ రాబోయే రోజుల్లో తన భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది. బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాల బడ్జెట్ అంతకంతకూ పెరుగుతుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

బెల్లంకొండ శ్రీనివాస్ భాషతో సంబంధం లేకుండా కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతుండటం గమనార్హం. స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించడానికి బెల్లంకొండ శ్రీనివాస్ ప్రాధాన్యత ఇస్తే మంచిది. బెల్లంకొండ శ్రీనివాస్ ను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతుండగా ఈ హీరో డబ్బింగ్ సినిమాలు హిందీలో యూట్యూబ్ లో అంచనాలకు మించి సక్సెస్ సాధించాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus