Manchu Vishnu: 48 గంటల్లోగా డిలీట్‌ చేయండి లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయ్‌!

యూట్యూబర్ ప్రణీత్‌ హనుమంతు చేసిన కొన్ని డబుల్‌ మీనింగ్‌ కామెంట్లు, దానికి ఆయన స్నేహితులు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారమే రేపాయి. ఈ విషయమై ఇప్పటికే టాలీవుడ్ సెలబ్రెటీలు బలంగా రియాక్ట్ అయ్యారు. తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు (Manchu Vishnu) స్పందించారు. నటీనటులపై ఇలాంటి వీడియోలు చేస్తున్న యూట్యూబర్లు, ట్రోలర్లకి విష్ణు వార్నింగ్ ఇచ్చారు. 48 గంటల్లోపు ఆ వీడియోలను డిలీట్ చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాడు.

తెలుగువాళ్లంటే మర్యాదస్తులు, పద్ధతిగా ఉంటారు అని ప్రపంచమంతా పేరుంది. కానీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కొంతమంది తెలుగువాళ్లు అసభ్యకరంగా ప్రవర్తిస్తుననారు. దీని వల్ల మొత్తం తెలుగువాళ్లకి చెడ్డపేరు వస్తుంది. రెండు మూడు రోజుల క్రితం హనుమంతు అనే యూట్యూబర్ గురించి సాయి తేజ్ సోషల్ మీడియాలో ప్రస్తావించడం వల్ల వాళ్ల బూతు బుద్ధి వెలుగులోకి వచ్చింది అంటూ విషయాన్ని చెప్పారు మంచు విష్ణు. హనుమంతు వీడియో ఎంత అసహ్యంగా ఉందో మాటల్లో చెప్పలేను. హనుమంతు కూడా ఒక మంచి కుటుంబం నుండి వచ్చినవాడే.

ఎందుకు ఇలా బిహేవ్ చేశాడో అర్థం కావడం లేదు. సోషల్‌ మీడియా కామెంట్ల విషయంలో గత మూడు రోజులుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కి లెటర్లు, మెయిల్స్ వస్తున్నాయి. ట్రోల్స్ చేస్తున్న ఇలాంటి యూట్యూబర్లపై చర్యలు తీసుకోవాలని అని ఆ లేఖల్లో కోరుతున్నారు అని విష్ణు ఓ వీడియో ద్వారా ప్రశ్నించారు. బ్రహ్మానందం (Brahmanandam) నిన్న కాల్ చేసి చాలా బాధపడ్డారు. నా ఫోటోలు మీమ్స్‌లో వాడితే చూసి ఎంజాయ్ చేస్తానని, కానీ కొన్ని జుగుప్సాకరమైన మీమ్స్‌లో తన ఫొటోలు వాడటం సరికాదు అని బ్రహ్మానందం చెప్పారని విష్ణు తెలిపారు.

వీటికి ఫుల్ స్టాప్ పెట్టాలి అని ఆయన కూడా కోరారు. మీరే ఇలాంటివి చూసుకోవాలి అని కూడా అన్నారు. అందుకే ఇప్పుడు చెబుతున్నాను.. అంటూ డెడ్‌లైన్‌ పెట్టారు. నటీనటులపై చెత్త వీడియోలు, మీమ్స్‌ వెంటనే డిలీట్ చేయండి. 48 గంటల్లో డిలీట్ అవ్వాలి. లేకపోతే యూట్యూబ్‌తో కలసి రివ్యూ చేసి మీ అకౌంట్లు బ్లాక్ చేయిస్తాం. అలాగే చట్టపరమైన చర్యలు తీసుకునే ఏర్పాట్లు చేస్తాను అని విష్ణు వార్నింగ్ ఇచ్చారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus