ఎన్టీఆర్ బయోపిక్ లో కీలక రోల్ పోషించనున్న బెంగాలీ నటుడు

Advertisement

ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎన్టీఆర్ బయోపిక్ ని అద్భుతంగా తెరకెక్కించాలని బాలకృష్ణ, క్రిష్ కు ఫిక్స్ అయిపోయారు. ఖర్చుకు వెనుకాడకుండా తక్కువ నిడివిగల పాత్రలకు సైతం స్టార్స్ ని తీసుకుంటున్నారు. ఎన్టీఆర్ గా బాలకృష్ణ నటిస్తున్న ఈ చిత్రంలో మహానటుడు భార్య బసవతారకమ్మ పాత్రలో విద్యాబాలన్ ని తీసుకున్నారు. అలాగే అప్పటి ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు రోల్ కోసం ప్రముఖ బాలీవుడ్ నటుడు సచిన్ కెడెకర్ ను ఖరారు చేశారు. తాజాగా మరో కీలక రోల్లో బెంగాలీ స్టార్ యాక్టర్ జిషు సేన్ ని క్రిష్ సెలక్ట్ చేశారు. అతను ఎల్వి ప్రసాద్ గా కనిపించనున్నారు. ఎన్టీఆర్ ను 1949 లో వచ్చిన ‘మన దేశం’ చిత్రంతో ఎల్వి ప్రసాద్ వెండి తెరకు పరిచయం చేశారు. ఆ సన్నివేశంలో నటింపజేయించేందుకు జిషు సేన్ ని ఎంపిక చేశారు.

ఇతను ఇది వరకే క్రిష్ దర్శకత్వంలో పనిచేశారు. క్రిష్ బాలీవుడ్ మూవీ మణికర్ణిక సినిమాలో ఝాన్సీ లక్ష్మీభాయ్ భర్తగా జిషు సేన్ నటించారు. అతని నటన నచ్చి ఎన్టీఆర్ బయోపిక్ లోను అవకాశమిచ్చారు. సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరిలతో కలిసి బాలయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి సంగీతమందిస్తున్నారు. ఏఎన్నార్ గా సుమంత్, కృష్ణ గా సుధీర్ బాబు, చంద్రబాబు నాయుడిగా రానా నటించనున్న ఈ చిత్రం ఈనెల ఐదవ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. రామోజీఫిల్మ్ సిటీ లో వేసిన సెట్స్ లో తొలి షెడ్యూల్ మొదలు పెట్టనున్నారు. ఆ తర్వాత నిమ్మకూరులో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus