Bhanu Sri Mehra: బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్ హీరోయిన్..!

సినిమాల్లో పెద్దగా రాణించకపోయినా సోషల్ మీడియాలో సందడి చేస్తున్న సెలబ్రిటీలు ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా హీరోయిన్లు సినిమాల్లో సక్సెస్ కాకపోయినా .. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం. తాజాగా ఓ హీరోయిన్ బీచ్ వద్ద తాగి ఎంజాయ్ చేస్తూ వార్తల్లో నిలిచింది. ఆమె మరెవరో కాదు..భాను శ్రీ మెహ్రా. ఈమె అల్లు అర్జున్ హీరోగా నటించిన వరుడు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2010 లో రిలీజ్ ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా తర్వాత ఈమె అలా ఎలా , గోవిందుడు అందరి వాడేలే.. చిత్రాల్లో నటించింది. అవి కూడా సక్సెస్ కాకపోవడంతో ఈమెకు అవకాశాలు రాలేదు. అయితే యూట్యూబ్ ఛానల్ ను స్థాపించి.. టూర్ లు వెళ్లిన వీడియోలను షేర్ చేస్తూ వస్తోంది. మొన్నామధ్య అల్లు అర్జున్ ఈమెను ట్విట్టర్ లో అన్ ఫాలో చేశాడని ఈమె చేసిన కామెంట్లు అన్నీ ఇన్నీ కాదు.

నీతో సినిమా చేసి నాకు కలిసొచ్చింది ఏమీ లేదు అంటూ కామెంట్ చేసి వార్తల్లో నిలిచింది. దీంతో మళ్లీ అల్లు అర్జున్ ఆమెను ఫాలో చేయడం జరిగింది. ఇదిలా ఉండగా.. ఈమె ఇటీవల వెకేషన్ కి వెళ్లి బీచ్ లో ఎంజాయ్ చేస్తూ, బీర్ తాగుతూ , చిల్ అవుతున్న వీడియోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus