పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్లో సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భీమ్లా నాయక్’. మలయాళం సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ కు రీమేక్ గా రూపొందిన ఈ చిత్రాన్ని ‘సితార ఎంటెర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మించగా…. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి సంభాషణలు,స్క్రీన్ ప్లే ను అందించారు. ఫిబ్రవరి 25న భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నప్పటికీ ఫుల్ రన్లో బ్రేక్ ఈవెన్ కాలేకపోయింది.
ఆంధ్రలో టికెట్ రేట్ల ఇష్యు నడుస్తున్నప్పటికీ ఈ చిత్రం తొలివారం భారీగా కలెక్ట్ చేసింది.కానీ ఆ తర్వాత నుండీ జోరు చూపించలేకపోయింది.
ఒకసారి క్లోజింగ్ కలెక్షన్లను గమనిస్తే :
నైజాం | 31.39 cr |
సీడెడ్ | 11.07 cr |
ఉత్తరాంధ్ర | 7.55 cr |
ఈస్ట్ | 5.48 cr |
వెస్ట్ | 5.13 cr |
గుంటూరు | 5.32 cr |
కృష్ణా | 3.97 cr |
నెల్లూరు | 2.60 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 72.50 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 7.37 cr |
ఓవర్సీస్ | 12.41 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 92.28 cr |
‘భీమ్లా నాయక్’ చిత్రానికి రూ.109.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.110 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.92.28 కోట్ల షేర్ ను రాబట్టింది.దాంతో బయర్లకి రూ. 17.72 కోట్లు నష్టం వాటిల్లినట్టు తెలుస్తుంది. ఆంధ్రాలో టికెట్ రేట్ల ఇష్యు ఉండడం వలన బ్రేక్ ఈవెన్ కాలేదు అనుకున్నా నైజాం కూడా బ్రేక్ ఈవెన్ కాకపోవడం గమనార్హం.
రెస్ట్ ఆఫ్ ఇండియా కూడా నష్టాలే మిగిలాయి. ఓవర్సీస్ లో మాత్రం బ్రేక్ ఈవెన్ ను సాధించింది. ఫైనల్ గా ఈ చిత్రాన్ని ఎబౌవ్ యావరేజ్ గా పరిగణించాలి.
Most Recommended Video
‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?