Bheemla Nayak: దిల్ రాజు రిస్క్ తీసుకుంటున్నాడా..?

  • November 16, 2021 / 11:16 AM IST

డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు చాలా అనుభవం ఉంది. ఒకప్పుడు తెలుగు సినిమాల నైజాం మార్కెట్ ఎప్పుడూ ముప్పై కోట్లు దాటని సమయంలో ‘బాహుబలి’ మీద ఆయన ఏకంగా రూ.50 కోట్లు పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే ఆ సినిమా భారీ లాభాలను తీసుకొచ్చింది. ఇప్పుడు ఒక సినిమా కోసం నైజాంలో ఏకంగా రూ.40 కోట్లు పెట్టేసినట్లు సమాచారం. ఆ సినిమా మరేదో కాదు.. ‘భీమ్లానాయక్’. ఇది మలయాళ ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ సినిమాకి రీమేక్.

కథలో భారీతనం ఏమీ ఉండదు. కానీ పవన్ కళ్యాణ్-రానా నటిస్తున్న సినిమా కావడంతో కాస్త బజ్ ఏర్పడింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని నమ్ముకొని దిల్ రాజు నైజాం హక్కుల కోసం ఏకంగా రూ.40 కోట్లు పెట్టినట్లు సమాచారం. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ కాకుండా మరే సినిమాకీ నైజాంలో రూ.40 కోట్లు రేటు పలకలేదు. అలాంటిది ‘భీమ్లా నాయక్’ మీద అంత మొత్తం పెట్టడమంటే సాహసమనే చెప్పాలి.

కానీ పవన్ స్టామినా మీద నమ్మకం, సినిమాపై ఉన్న బజ్ కి రిస్క్ చేసి దిల్ రాజు భారీ మొత్తానికి సినిమా రైట్స్ ను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా దిల్ రాజుకి ఏ రేంజ్ లో లాభాలను తీసుకొస్తుందో చూద్దాం!

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus