Chiranjeevi, Pawan Kalyan: చిరు, పవన్ మధ్య పోటీ తప్పదా?

Advertisement

కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వల్ల పెద్ద హీరోల సినిమాలకు రిలీజ్ డేట్ సమస్యగా మారింది. సంక్రాంతి పండుగకు ఇప్పటికే భీమ్లా నాయక్, సర్కారు వారి పాట, రాధేశ్యామ్ రిలీజ్ కానున్నట్టు ఆయా సినిమాల మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మరోవైపు దర్శకుడు కొరటాల శివ ఆచార్య సినిమాను సంక్రాంతి పండుగకే విడుదల చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. సంక్రాంతి నాటికి కరోనా తీవ్రత తగ్గి దేశవ్యాప్తంగా సాధారణ పరిస్థితులు ఏర్పడతాయని కొరటాల శివ భావిస్తున్నట్టు సమాచారం.

అయితే డైరెక్టర్ కొరటాల శివ భీమ్లా నాయక్ నిర్మాతలతో రిలీజ్ డేట్ కు సంబంధించి చర్చలు జరిపారని మేకర్స్ మాత్రం రిలీజ్ డేట్ విషయంలో వెనక్కు తగ్గడానికి ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. ఈ వార్తలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. ఆచార్య సినిమా కూడా సంక్రాంతికే రిలీజవుతుందా లేక మరో రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంటుందా చూడాల్సి ఉంది. త్వరలోనే ఆచార్య రిలీజ్ డేట్ గురించి క్లారిటీ రానుంది.

చరణ్, చిరంజీవి కలిసి నటించిన మూవీ కావడంతో ఆచార్య మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. భరత్ అనే నేను సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం. చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు. ఈ సినిమా కొరకు మెగా అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుండగా ఈ సినిమా ఎప్పుడు రిలీజవుతుందో చూడాల్సి ఉంది. సంక్రాంతికి మెగా హీరోల మధ్య పోటీ ఉంటుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus