వరుసగా 3 డిజాస్టర్లు పడిన తర్వాత స్టార్ హీరోలే హిట్టు కొట్టడానికి కిందా మీదా పడతారు.. అలాంటిది మీడియం హీరో పై అంత ఎక్ష్పెక్టేషన్స్ ఉంటాయని ఎంత వరకూ చెప్పగలం. అయితే అలాంటి సెంటిమెంట్లను బ్రేక్ చేస్తూ నితిన్.. స్ట్రాంగ్ కం బ్యాక్ కు రెడీ అయ్యాడు. ఆయన హీరోగా నటించిన ‘భీష్మ’ చిత్రం నిన్న(ఫిబ్రవరి 21న) విడుదలయ్యింది. ‘ఛలో’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన వెంకీ కుడుముల డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి షోతోనే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. శివరాత్రి సెలవు కూడా కలిసి రావడం.. స్పెషల్ గా కొన్ని ఏరియాల్లో మిడ్ నైట్ షోలు కూడా వెయ్యడంతో.. నితిన్ కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి.
ఇక ‘భీష్మ’ మొదటి రోజు కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
నైజాం | 2.29 cr |
సీడెడ్ | 0.81 cr |
ఉత్తరాంధ్ర | 0.64 cr |
ఈస్ట్ | 0.67 cr |
వెస్ట్ | 0.56 cr |
కృష్ణా | 0.41 cr |
గుంటూరు | 0.77 cr |
నెల్లూరు | 0.27 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.72 cr |
ఓవర్సీస్ | 0.93 cr |
వరల్డ్ వైడ్ టోటల్ | 8.07 cr (share) |
‘భీష్మ’ చిత్రానికి 22.7 కోట్ల బిజినెస్ జరిగింది. మొదటి రోజు ఈ చిత్రం 8.07 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇంకా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే మరో 14.63 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. రెండో రోజు కూడా ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ బాగున్నాయి. సో మొదటి వీకెండ్ ను ఈ చిత్రం బాగా క్యాష్ చేసుకుని 50శాతం పైనే రికవరీ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మరి వారి నమ్మకం ఎంతవరకూ నిజమవుతుందో చూడాలి.
Click Here To Read Bheeshma Movie Review
Most Recommended Video
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!