మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన ‘భోళా శంకర్’ మూవీ ఆగస్టు 11న రిలీజ్ కాబోతోంది. ‘ఎకె ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించిన ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటించగా..కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలి పాత్రని పోషించింది. మహతి స్వర సాగర్ సంగీత దర్శకుడు. యంగ్ హీరో సుశాంత్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించాడు. మొదటి రోజు సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది.
దీంతో కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో రాలేదు.రెండో వీకెండ్ ను కూడా ఈ మూవీ పెద్దగా క్యాష్ చేసుకోలేకపోయింది. ఒకసారి 10 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే:
నైజాం | 6.98 cr |
సీడెడ్ | 3.31 cr |
ఉత్తరాంధ్ర | 3.23 cr |
ఈస్ట్ | 2.02 cr |
వెస్ట్ | 2.26 cr |
గుంటూరు | 2.71 cr |
కృష్ణా | 1.66 cr |
నెల్లూరు | 1.20 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 23.37 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 1.89 cr |
ఓవర్సీస్ | 2.25 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 27.51 cr (షేర్) |
‘భోళా శంకర్’ (Bhola Shankar) చిత్రానికి రూ.78.32 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.79 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 10 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రానికి రూ.27.51 కోట్ల షేర్ నమోదైంది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ. 51.49 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.
2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?
‘భోళా శంకర్’ తో పాటు కోల్కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!
‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్