మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘భోళా శంకర్’ చిత్రం నుండి ఆల్రెడీ రెండు పాటలు రిలీజ్ అయ్యాయి. మొదటి పాట పెద్దగా జనాలకి ఎక్కలేదు. కానీ రెండో పాట బాగుంది. ఫోక్ సాంగ్ టచ్ ఇవ్వడంతో ఆ పాట కొన్ని చోట్ల మార్మోగుతుంది. ఇక ఈ చిత్రం నుండి మూడో పాట రిలీజ్ అయ్యింది. ‘మిల్కీ బ్యూటీ’ అంటూ సాగే ఈ పాట కొద్దిసేపటి క్రితం సోషల్ మీడియాలో రిలీజ్ అవ్వడం జరిగింది.
సంగీత దర్శకుడు మహతి సాగర్ ఈ పాటకి సమకూర్చిన ట్యూన్ గతంలో మణిశర్మ.. ‘అన్నయ్య’ ‘స్టాలిన్’ సినిమాల్లోని మెలోడీ సాంగ్స్ ను గుర్తుచేసే విధంగా ఉంది. ఎంతైనా ఆయన వారసుడే కాబట్టి.. చిరుని ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఈ ట్యూన్ ను అందించినట్టు అనుకోవచ్చు. రామజోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్ బాగున్నాయి.
సంజన, విజయ్ ప్రకాష్, మహతి సాగర్..లు ఈ పాటని హుషారెత్తించే విధంగా ఆలపించారు. ఇక పాటలోని చిరు, తమన్నా ల కాస్ట్యూమ్స్ ను.. సుష్మిత కొణిదల డిజైన్ చేయడం జరిగింది. అవి కూడా అట్రాక్టివ్ గా కనిపించాయి. ఇక చిరు, తమన్నా లు స్పీడ్ గా అయితే స్టెప్పులు వేయలేదు.
ట్యూన్ అలాంటిది కాబట్టి.. సింపుల్ స్టెప్స్ తో ఆకట్టుకున్నారు. మొత్తంగా క్యాచీ ట్యూన్ తో చిరు, తమన్నా ల డాన్స్ లతో ‘మిల్కీ బ్యూటీ’ లిరికల్ సాంగ్ కి మంచి మార్కులు పడతాయి అని చెప్పొచ్చు. మీరు కూడా ఓసారి చూస్తూ వినండి :
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!
సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు