పాన్ ఇండియా ఎంట్రీలో బన్నీ చేసిన మిస్టేక్ అదే!

అల వైకుంఠపురంలో మూవీ విజయంతో జోష్ మీదున్న అల్లు అర్జున్ తన నెక్స్ట్ మూవీ పుష్పను పాన్ ఇండియా చిత్రంగా ప్రకటించారు. దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఇక కెరీర్ లో మొదటిసారి బన్నీ డీగ్లామర్ రోల్ చేస్తున్నారు. ఆయన రాయలసీమకు చెందిన ఓ లారీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ మూవీ నాలుగు భాషలలో విడుదల కానుంది.

కాగా ఈ మూవీలో హీరోయిన్ గా రష్మిక మందాన నటిస్తున్న సంగతి తెలిసిందే. ఐతే పాన్ ఇండియా మూవీలో హీరోయిన్ గా రష్మిక సరిపోతుందా అనే కొత్త డౌట్ బన్నీ ఫ్యాన్స్ లో మొదలైంది. ముఖ్యంగా హిందీలో మంచి రీచ్ ఉండాలి అంటే బాలీవుడ్ భామను దించాలి. ప్రభాస్ 21 మూవీకి ఏకంగా దీపికా పదుకొనెని తీసుకున్న సంగతి తెలిసిందే. అంత పెద్ద స్టార్ హీరోయిన్ కాకపోయినా బాలీవుడ్ ప్రేక్షకులకు తెలిసిన హీరోయిన్ ని తీసుకొని ఉంటే బాగుండేది.

కేవలం సౌత్ ఇండియాకు తెలిసిన, అది కూడా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరోయిన్ ని తీసుకొని తప్పుచేశారని కొందరి అభిప్రాయం. ఐతే పుష్ప మూవీని మొదట పాన్ ఇండియా చిత్రంగా అనుకోలేదు. అల వైకుంఠపురంలో విజయం తరువాత కొద్దిరోజులకు దీనిని పాన్ ఇండియా మూవీగా ప్రకటించారు. బన్నీ బర్త్ డే కానుకగా పుష్ప ఫస్ట్ లుక్ వచ్చే వరకు ఎవరికీ ఈ విషయం తెలియదు. కనుక ముందే రశ్మికను ఈ మూవీ హీరోయిన్ గా తీసుకోవడంతో ఈ చిక్కొచ్చి పడింది. మొదట్లోనే పుష్ప టీమ్ కి పాన్ ఇండియా ఆలోచన ఉంటే హీరోయిన్ గా రశ్మికను తీసుకొనేవారు కాదు.

Most Recommended Video

ఎక్కువ రోజులు థియేటర్స్ లో ప్రదర్శింపబడిన సినిమాల లిస్ట్!
విడుదల కాకుండానే పైరసీ భారిన పడ్డ సినిమాలు ఎవేవంటే..?
ఈ బుల్లితెర నటీమణుల పారితోషికాలు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus