Krithi Shetty: కృతి శెట్టి వరుస హిట్లకి బ్రేక్ పడినట్టేనా!

  • July 19, 2022 / 11:41 AM IST

‘ఉప్పెన’ చిత్రం పెద్ద హిట్ అవ్వడానికి హీరోయిన్ కృతి శెట్టి కూడా ఓ కారణమని చెప్పాలి.ఆమె లుక్స్ యువతని ఎంతగానో ఆకర్షించాయి. ‘ఉప్పెన’ లో ఓ పక్క అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపిస్తూనే మరోపక్క రొమాంటిక్ సన్నివేశాల్లో కూడా నటించి యువతను ఆకర్షించింది ఈ బ్యూటీ. ఆ చిత్రం బ్లాక్ బస్టర్ అవ్వడం అటు తర్వాత ‘శ్యామ్ సింగ రాయ్’ కూడా హిట్ అవ్వడంతో ఈమెకు బాగా కలిసొచ్చింది. ఈ రెండు చిత్రాలతోనే పారితోషికం ఎక్కువ డిమాండ్ చేయడం మొదలుపెట్టింది.

‘శ్యామ్ సింగరాయ్’ లో కూడా సిగరెట్లు కాలుస్తూ, ఇంటిమేట్ సీన్ లో నటించడంతో గ్లామర్ షోకి కూడా ఈమె హద్దులు పెట్టుకోలేదని దర్శకులకు అర్ధమైంది. దానికి తోడు ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘బంగార్రాజు’ కూడా హిట్ అవ్వడంతో ఈమె కోటి రూపాయల హీరోయిన్ అయిపోయింది. అప్పటినుండి ఆమె నటించే ప్రతి సినిమాకి కోటి డిమాండ్ చేయడం మొదలుపెట్టింది అని ఇన్సైడ్ టాక్. ‘ది వారియర్’ చిత్రంలో కూడా ఈమె హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.

ఈ చిత్రం కూడా హిట్ అయితే ఈమె మరికొంచెం పెంచాలని చూసింది. కానీ ఈసారి సీన్ రివర్స్ అయ్యింది. జూలై 14న రిలీజ్ అయిన ‘ది వారియర్’ చిత్రం బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ చాలా వీక్ గా ఉంది. మొదటి వీకెండ్ ఓకే అనిపించినా టార్గెట్ పెద్దది కాబట్టి బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ నష్టాలను మిగల్చడం ఖాయమని ట్రేడ్ పండితులు తేల్చేశారు.

దీంతో కృతిశెట్టి ఆశలపై నీళ్లు కొట్టినట్టు అయ్యింది. పోనీ ఈ చిత్రంలో ఆమె పాత్ర ఏమైనా బాగుందా అంటే అదీ లేదు. లవ్ సీన్స్ వచ్చినప్పుడల్లా ఆడియన్స్ బోర్ ఫీలయ్యారు. మొత్తంగా ఈ సినిమా కృతి సక్సెస్ లకు బ్రేక్ వేసినట్టే అని చెప్పాలి.తర్వాతి సినిమాల విషయంలో ఆమె జాగ్రత్త పడకపోతే చాలా కష్టమనే చెప్పాలి.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus