ఈమధ్యనే మూడో పెళ్లి చేసుకున్న వనితా విజయ్ కుమార్ కు ఎక్కడా లేని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అయినప్పటికీ వాటిని ఆమె చాలా తేలికగా తీసుకుంటూ.. ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తూ వస్తోంది. ఈమె మూడో పెళ్లి చేసుకున్న పీటర్ పాల్ కు కూడా అది రెండో పెళ్లి. అందులోనూ అతను తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే.. రెండో పెళ్లి చేసుకున్నాడు. దాంతో అతని మొదటి భార్య అయిన ఎలిజబెత్ .. పీటర్ పాల్ మరియు వనితల పై కేసు వేసింది.
అయినా ‘పెద్ద వాళ్ళైన ఇద్దరు కూతుర్లను పెట్టుకుని.. మూడో పెళ్లి చేసుకోవడం ఏంటి?’ అంటూ కోలీవుడ్ సినీ సెలబ్రిటీలు కొంతమంది విమర్శలు చేసారు. వాటికి వనిత కూడా ఘాటుగా రిప్లై ఇచ్చింది. ముఖ్యంగా ఓ లైవ్ షోలో దర్శకురాలు లక్ష్మీ రామకృష్ణన్ పై ‘ఒక్క మొగుడితో ఉంటున్నంత మాత్రాన నువ్వేమీ పతివ్రతవి.. నీ బ్రతుకు నాకు తెలుసు. నీ బండారం బయట పెడతా’ అంటూ ఘోరమైన కామెంట్స్ చేసింది వనిత.
అందుకు గాను దర్శకురాలు లక్ష్మీ రామకృష్ణన్.. వనిత కు 1.25 కోట్ల నష్టపరిహారం చెల్లించాలంటూ నోటీసులు పంపింది. ఆ నోటీసులకు సంబంధించిన కాపీని.. చెన్నై వడపళని మహిళా పోలీస్ స్టేషన్‌తో పాటు వడపళని అసిస్టెంట్ పోలీస్ కమిషనర్‌కు అలాగే చెన్నై మహిళా సంఘానికి అందజేసింది. అయితే ఈ నోటీసులకు ‘నేను లొంగి పోయే దాన్ని కాదు.. నేను కూడా ఆమెకు నోటీసులు పంపుతాను’ అంటూ వెటకారపు కామెంట్స్ చేసింది వనిత.
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
Most Recommended Video
పవర్ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల IMDB రేటింగ్స్!
తెలుగు సినిమాల్లో నటించిన 27 బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?