‘మహర్షి’ సినిమాలో బిగ్ బాస్ కంటెస్టెంట్ దివి… ఏ సీన్లో కనిపిస్తుందో తెలుసా..?

  • September 17, 2020 / 08:21 PM IST

ఈ మధ్యకాలంలో పెద్ద హీరోల సినిమాల్లో చిన్న పాత్రలు చేసే నటీమణులను … వారి పేర్ల ముందు ఆ సినిమా పేర్లు చేర్చి సంభోధించడం మనం చూస్తూనే వస్తున్నాం. ఇప్పుడు ‘బిగ్ బాస్’ హౌస్లోకి 14వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన దివి ని కూడా ‘మహర్షి’ ఫేమ్ దివి అంటున్నారు.అయితే ఆ సినిమాలో ఈమె ఎక్కడ ఉంది? ఏ సీన్లో కనిపిస్తుంది అనేది అందరిలో నెలకొన్న సందేహం. మహేష్ 25 వ సినిమా ‘మహర్షి’. అందులోనూ అది హిట్టు సినిమా.

అలాంటి సినిమాలో నటించిన దివి ని ఎవ్వరూ గుర్తుపట్టలేకపోతున్నారు అంటే అంత గుర్తింపు ఉన్న పాత్ర దివి చెయ్యలేదు అని కొందరు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. చెప్పాలంటే… వారు అనుకునేది కరెక్టే…! ‘మహర్షి’ చిత్రంలో కాలేజీ ఎపిసోడ్ లో హీరోయిన్ పూజా హెగ్దే ఎదురుగా ఉండగా ఆమెను ఏడిపించదానికి… దివి ని మహేష్ ‘గీత సాయంత్రం కాఫి కి వెళ్దామా’ అని అడుగుతాడు.

అంతే కాకుండా ‘చోటి చోటి’ సాంగ్లో క్లాస్ రూమ్లో మహేష్ ఎగ్జామ్ రాస్తున్న విజువల్ లో అతని పక్కన కనిపిస్తూ ఉంటుంది దివి. కింద ఫోటోలను చూడండి మీకే ఓ క్లారిటీ వస్తుంది. ఇక ‘బిగ్ బాస్’ హౌస్ లో దివి అస్సలు నోరు మెదపకుండా చాలా సైలెంట్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈమె యోగా ఫోజులు మాత్రం కుర్రకారుని ఆకర్షిస్తున్నాయి.

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus