బిగ్‌బాస్ నాలుగో సీజన్‌లో తొలి రోజు నుంచి హైలైట్‌గా నిలుస్తున్న కంటెస్టెంట్ గంగవ్వ. ఓల్డెస్ట్ యూట్యూబ్ స్టార్ అందరి మన్ననలు పొందిన గంగవ్వ… బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇస్తోంది అని తెలియగానే… నెటిజన్లు భలే ఖుషీ అయ్యారు. ఆవ్వ ఇంట్లోకి వచ్చాక దానిని డబుల్ చేశారు. మీమ్స్, పోస్టులతో దద్దరిల్లిపోయేలా చేశారు. దానికి తగ్గట్టే తొలి వారం గంగవ్వ భలే పర్‌ఫార్మన్స్ ఇచ్చింది. ప్రతి రోజూ ఏదో ఒక కొత్త సందడి చేస్తూ కనిపించింది. అయితే రెండో వారంలో ఇది కనిపించడం లేదు. ఎందుకా అని చూస్తే… గంగవ్వ మరో సంపూర్ణేశ్ బాబు అవుతుందేమో అనిపిస్తోంది.
బిగ్‌బాస్‌లో సంపూర్ణేశ్ బాబు ఎంత సందడి చేశాడో మనందరికీ తెలిసిందే. అప్పటికే సినిమాల్లో స్టార్ కమేడియన్, సెటైరికల్ హీరోగా ఉన్న సంపూర్ణేశ్‌బాబు బిగ్‌బాస్‌లోకి వచ్చాడు. తొలి ఎపిసోడ్ నుంచే తనదైన శైలిలో వినోదం పంచాడు. వివిధ అంశాలపై తనదైన శైలిలో విలేజ్ పంచ్‌లు వేసేవాడు. కొన్ని అంశాలపై ఆయన అభిప్రాయాలు ఎలాంటి భేషజాలు లేకుండా చెప్పేవాడు. ఇప్పుడు గంగవ్వ కూడా అలానే ఉంటోంది. చెప్పాలనుకున్న విషయాన్ని నిర్మొహమాటంగా చెప్పేస్తుంది. అయితే కొన్ని రోజులు గడిచేసరికి సంపూర్ణేశ్ బాబు బయటకు వెళ్లిపోతా అంటూ గోల గోల చేశాడు. ఆఖరికి కన్ఫెషన్ రూమ్‌కి వెళ్లి బిగ్‌బాస్‌ను ఒప్పించి బయటకు వెళ్లిపోయాడు.
గంగవ్వ విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. రెండో వారం మొదటి నుంచి గంగవ్వ ఇంట్లో ఉండటానికి సుముఖంగా లేదని తెలుస్తోంది. తొలి వీకెండ్‌లో నాగార్జున ‘బయటకు వెళ్లిపోదాం అనుకుంటున్నాను’’ అని చెప్పేసింది గంగవ్వ. అయితే ‘నువ్వు అలా వెళ్లిపోవడానికి వీల్లేదు… నువ్వు ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు’ అని చెప్పాడు కూడా. అయితే ఇంట్లో పరిస్థితులు అనువుగా లేవని, నిద్రపట్టడం లేదని కూడా చెప్పింది. ఇప్పటికీ అదే పరిస్థితి ఉందట. దీంతో గంగవ్వ యాక్టివ్‌గా కనిపించడం లేదు. రెండు, మూడు రోజులగా షోలో గంగవ్వకు సరైన స్క్రీన్ స్పేస్ కూడా దొరకడం లేదు.
ఇదంతా పక్కన పెడితే… ఈ రోజు షోలోకి రెండో వైల్డ్ కార్డు ఎంట్రీ ఉండబోతోంది. జబర్దస్త్ అవినాష్ వైల్డ్‌కార్డుగా రాబోతున్నాడు. మామూలుగా అయితే రెండు వైల్డ్‌కార్డుల మధ్య కనీసం మూడు వారాల గ్యాప్ ఇచ్చేవారు. అయితే ఈ సారి రెండు రోజుల గ్యాప్‌లోనే తీసుకొస్తున్నారు. అంటే ఈ వారం రెండు నామినేషన్లు ఉండొచ్చు. ఒకటి ఓట్ల పరంగా సాగితే, ఇంకొకటి రిక్వెస్ట్ పరంగా చేయొచ్చని అంటున్నారు. అయితే ఈ రిక్వెస్ట్‌ను రిక్వెస్ట్‌లా చూపిస్తారో లేదంటే వేరే ఏదైనా కలర్ పూస్తారో చూడాలి. అలా రిక్వెస్ట్ పరంగా వెళ్లేది గంగవ్వనే అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొన్న పడవ నామినేషన్‌లో తొలుత దిగిపోయింది కూడా గంగవ్వనే గుర్తుందిగా.
గంగవ్వ బయటకు వెళ్లిపోతే బిగ్‌బాస్ పరిస్థితి ఏంటి.. అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. కారణం ప్రస్తుతం బిగ్‌బాస్‌ను ఎక్కువమంది చూస్తున్నది, ఓట్లు పడుతున్నది ఆమె వల్లే అన్నది నెటిజన్ల మాట. మరి గంగవ్వ వెళ్లిపోతే ఓట్ల శాతం తగ్గుతుంది. చూసేవాళ్లు అంటే పెద్దగా తగ్గకపోవచ్చు అనేది మరో మాట. ఇది ఎలిమినేషన్ తర్వాత ఒకటి రెండు రోజులకు తెలుస్తుంది. ఆమె వెళ్లిపోతే ఆమెను మ్యాచ్ చేసే పర్సన్‌గా ఇంట్లో ఎవరు బయటకు వస్తారో చూడాలి. అన్నట్లు ఈ వారం బయటికెళ్లిపోయే మరో పర్సన్ కళ్యాణి అనే అంటున్నారు. ప్రైవేటు ఓటింగ్స్‌లో ఎవరు వెళ్లిపోతారు అంటే… ఎక్కువ శాతం మంది కళ్యాణి అనే చెబుతున్నారు.
Most Recommended Video
బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!