బిగ్‌బాస్‌లో లవ్ ట్రాక్‌లు కొత్తేమీ కాదు. తెలుగులోనే కాకుండా మిగిలిన భాషల్లోనూ కంటెస్టెంట్ల మధ్య లవ్ ట్రాక్‌లు చూశాం. అయితే ట్రయాంగిల్ లవ్ స్టోరీలు మాత్రం చాలా తక్కువ కనిపిస్తాయి. నాలుగో సీజన్‌లో ఈ ట్రయాంగిల్ స్టోరీ కనిపిస్తోంది. అభిజీత్ – మోనాల్ – అఖిల్ మధ్య ఏదో జరుగుతోంది అంటూ బిగ్‌బాస్ ప్రోమోల్లో చూపిస్తూనే ఉన్నాడు. అభిజీత్ – మోనాల్ మాట్లాడుకుంటుంటే అఖిల్ సీరియస్‌గా చూస్తుండటం… మోనాల్‌లో ఎవరితోనైనా డ్యాన్స్ చేస్తుంటే అఖిల్ గుస్సా కావడం కనిపిస్తోంది. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు.. మరోవైపు అంటే అభిజీత్‌ను టార్గెట్ చేయడం కనిపిస్తోంది.
మోనాల్‌తో పరియం పెంచుకుందామని, కనెక్షన్ స్ట్రాంగ్ చేసుకుందామని అభిజీత్ గత కొన్ని రోజులుగా ట్రై చేస్తూనే ఉన్నాడు. అయితే టైమ్ సరిపోవడం లేదని మోనాల్ చెప్పింది. ఆమె మనసులో ఏముందో కానీ… మాట్లాడలేదు. దీనిని మనం రెండు మూడుసార్లు చూశాం కూడా. మాట్లాడిన రెండు మాటలకు కూడా ఆమె నుంచి సరైన స్పందన లేదు. ఇదంతా రాత్రి నిద్రపోయే ముందు జరిగింది. తీరా ఉదయం లేచి చూసేసరికి… అఖిల్ కోపం మీద ఉన్నాడు. ఎందుకో మరి. అంతకుముందు బయట కూర్చొని మోనాల్ – అభిజీత్ మాట్లాడుకున్నారు. చిన్ననాటి సంగతులు, ఇష్టాయిష్టాలు చెప్పుకున్నారు. ఆ తర్వాత అఖిల్‌తో మోనాల్ మాట్లాడుతుండగా… అఖిల్ ఏదో డల్‌గా కనిపించాడు. అప్పుడూ ఎందుకో తెలియలేదు.
నిన్న మోనాల్ – అభిజీత్ దోసలు తింటున్నప్పుడు మోనాల్‌కు పొలమారింది. నీళ్ల కోసం అభిజీత్ లేచి గ్లాస్ అందుకొని నీళ్లు పట్టడానికి వచ్చేలోగా… దూరంగా టిఫిన్ చేస్తున్న అఖిల్ వచ్చి బాటిల్‌లో నీళ్లు పడుతున్నాడు. ‘ఏంటి ఇస్తున్నావా’ అని అభిజీత్ అడిగినా అఖిల్ సమాధానం చెప్పలేదు. అంతేకాకుండా విసరుగా వెళ్లిపోయాడు కూడా. ఆ తర్వాత ఒకటి రెండు సందర్భాల్లోనూ ఇలాగే జరిగింది. ఇదే విషయాన్ని ఎవరు అడిగినా అఖిల్ సరైన సమాధానం చెప్పలేదు. మార్నింగ్ వేకప్ సాంగ్‌లో డ్యాన్స్‌లు వేసేటప్పుడు కూడా అఖిల్ సింగిల్‌గా డ్యాన్స్ చేస్తుండటం గమనార్హం.
అఖిల్ – అభిజిత్ – మోనాల్ విషయంలో ఏమైందా అని ప్రేక్షకులు అనుకుంటుండగా… నిన్న అభిజీత్ క్లారిటీ ఇచ్చాడు. ‘‘ఒక రోజు అఖిల్ వచ్చి… అభిజీత్‌తో నిన్న ‘రా’ అనొచ్చు అని అడిగాడు. 24 ఏళ్ల అఖిల్‌ది నా తమ్ముడి వయసు. ‘కాదురా ఇలా మాట్లాడు..’ అని అనడం వేరు.. ‘అరె అభిజీత్ ఇట్లారారేయ్’ అనడం వేరు. ఇదే విషయాన్ని అఖిల్ కు చెప్పా’’ అంటూ అభిజీత్ అసలు విషయం చెప్పాడు. ఆ రోజు విషయాన్ని క్లారిటీగా చెప్పినా… అర్థం చేసుకున్నట్లు లేడు. అక్కడే మా మధ్య దూరం పెరిగింది. అయినా నా చెడ్డీ బడ్డీ కాడు కదా… నేనెందుకు ఆ చనువు ఇవ్వాలి అంటూ అభిజీత్ ఫుల్ క్లారిటీతో ఉన్నాడు.
మోనాల్ – అఖిల్ విషయంలో మరో విషయం కూడా జరిగింది. ముందు రోజు రాత్రి అఖిల్ , అభిజీత్ మాట్లాడుకొని తర్వాత లేచి బాగానే వెళ్లి నిద్రపోయారు. రెండో ఉదయాన్నే లేచి అభిజీత్ నిద్ర ముఖంలో ఉండగా… మోనాల్ టీ ఆఫర్ చేసింది. అయితే సుగర్ టీ తాగే అలవాటు లేకపోవడం వల్ల అభిజీత్ వద్దన్నాడు. దాంతో మోనాల్ కోపంగా టీని విసిరి పక్కకు పడేసింది. ఆ తర్వాత వేరే కప్‌లోకి తీసుకుంది. దానిని అఖిల్ చూశాడు. ఈ రెండు విషయాల వల్ల అఖిల్ కోపంగా ఉన్నాడేమో అనిపిస్తోంది అంటూ అభిజీత్ లాస్య, సుజాతకు చెప్పాడు. ఇక్కడ విషయమేంటంటే ఈ రెండూ బిగ్ బాస్ ప్రేక్షకులకు చూపించలేదు. అయినా ఇలాంటివి బిగ్‌బాస్ ఎలా మిస్ అయ్యాడబ్బా. వీకెండ్‌లో చూపిస్తారేమో మరి. ఏదైనా అభిజీత్‌ను టార్గెట్ చేయాలని అఖిల్ చూస్తున్నాడా? లేక అఖిల్ – మోనాల్ కలసి చూస్తున్నారా? లేక ఇదంతా చూపించకుండా బిగ్‌బాస్ గేమ్ ఆడుతున్నాడా అనేది తెలియాల్సి ఉంది.
బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!