Priyanka Jain: చిన్నప్పుడు ఈ ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి ప్రస్తుతం బిగ్ బాస్ 7 కంటెస్టెంట్.. ఎవరో గుర్తుపట్టారా..!

  • October 3, 2023 / 05:48 PM IST

ఈ ఫొటోలో క్యూట్ గా కనిపిస్తున్న ఈ చిన్న అమ్మాయిని ఎవరో గుర్తు పట్టారా?, ఈమె తొలుత సీరియల్స్ ద్వారా మంచి క్రేజ్ ని దక్కించుకుంది. స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన టాప్ టీఆర్ఫీ రేటింగ్స్ ఉన్న సీరియల్స్ మొత్తం ఈమెనే చేసింది. చూపులు తిప్పుకోలేని అందం, చక్కటి అభినయం ఈమె సొంతం. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగుతూ ముందుకు దూసుకెళ్తుంది.

కేవలం ఈమె కోసమే బిగ్ బాస్ షో ని చూసే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఆమె మరెవరో కాదు ప్రియాంక జైన్. ఈమెకి సంబంధించిన చిన్నప్పటి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. బుల్లితెర మీద అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన అతి తక్కువ మందిలో ఒకరైన ఈమె, ఇప్పుడు బిగ్ బాస్ షో ద్వారా ఆడియన్స్ కి మరింత చేరువ అయ్యింది.

ముంబై కి చెందిన ఈమె స్టార్ మా ఛానల్ లో ప్రసారం అయ్యే ‘మౌన రాగం’ సీరియల్ ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది. ఆ సీరియల్ లో హీరో గా నటించిన శివ తోనే ఆమె త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ఈ సీరియల్ పెద్ద హిట్ అయ్యాక ఆమెకి పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కింది. కానీ అన్నీ చిన్న సినిమాలే, పెద్ద హీరోల సినిమాల్లో చిన్న రోల్ పోషించే ఛాన్స్ కూడా దక్కలేదు.

ఇక ‘జానకి కలగనలేదు’ సీరియల్ అతి పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడం తో ఈ అమ్మాయి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా చేరువ అయ్యింది. ఇప్పుడు ఈమె బిగ్ బాస్ షో ద్వారా ఇంకా పాపులర్ అవ్వడం వల్ల ఆమెకి భవిష్యత్తులో పెద్ద హీరోల సినిమాల్లో నటించే ఛాన్స్ కూడా లేకపోలేదు. ఎందుకంటే ప్రియాంక (Priyanka Jain) ఇప్పుడు హీరోయిన్స్ లో అందం లో కానీ నటన లో కానీ ఏమాత్రం తక్కువ కాదు.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus