Sivaji: బిగ్ బాస్ హోస్ట్ మారనున్నారా..వైరల్ అవుతున్న న్యూస్!

  • January 16, 2024 / 01:12 PM IST

బిగ్ బాస్ కార్యక్రమం సీజన్ సెవెన్ ఇటీవల పూర్తి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.ఈ కార్యక్రమం ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటివరకు ప్రసారమైనటువంటి సీజన్ లలో ఈ సీజన్ కి మంచి రేటింగ్ లభించిందని చెప్పాలి. ఇక ఈ సీజన్ మంచి సక్సెస్ కావడంతో తదుపరి సీజన్ కోసం నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సీజన్ మంచి సక్సెస్ కావడంతో సీజన్ 8 త్వరగా ప్రసారం చేయాలనే ఆలోచనలో బిగ్ బాస్ నిర్వాహకులు ఉన్నారని ఇప్పటికే కంటెస్టెంట్ ల ఎంపిక ప్రక్రియ కూడా మొదలు పెట్టారని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా తాజాగా ఈ సీజన్ కి సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది. మూడవ సీజన్ నుంచి ఈ కార్యక్రమానికి నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సీజన్ 8 కార్యక్రమానికి నాగార్జున కాకుండా శివాజీ యాంకర్ గా వ్యవహరించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనే విషయానికి వస్తే శివాజీ యాంకర్ గా వ్యవహరిస్తున్నారన్న మాట వాస్తవమే కానీ అది బిగ్ బాస్ కార్యక్రమానికి కాదని బిగ్ బాస్ బజ్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్నారని తెలుస్తుంది.

ఎలిమినేట్ అయినటువంటి కంటెస్టెంట్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారనే సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి ముందు సీజన్లో పాల్గొన్నటువంటి కంటెస్టెంట్లు యాంకర్లుగా వ్యవహరిస్తారు. బిగ్ బాస్ సీజన్ సెవెన్ బజ్ కార్యక్రమానికి గీతూ రాయల్ వ్యాఖ్యతగా వ్యవహరించగా ఎనిమిదవ సీజన్ లో ప్రసారమయ్యే బజ్ కార్యక్రమానికి శివాజీ (Sivaji) యాంకర్ గా వ్యవహరించబోతున్నారని తెలుస్తోంది.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus