‘సహ జీవనం టు వివాహం’.. బిగ్ బాస్ కంటెస్టెంట్ సాధించాడు..!

మన తెలుగు బిగ్ బాస్ కంటెస్టెంట్ లకు బిగ్ బాస్ పెద్దగా కలిసి రాలేదు. హౌస్ లో ఉన్నంత వరకూ వీళ్ళకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వుండేది. కానీ షో ముగిశాక వీళ్ళని ఎక్కువగా ఎవ్వరూ పట్టించుకోలేదు. అయితే మిగిలిన భాషల్లో మాత్రం.. ఈ షో లో పాల్గొన్న కంటెస్టెంట్లు అందరికీ బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. బయటకి వచ్చాక వాళ్ళ క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి. ఇప్పుడు ఓ ‘బిగ్ బాస్’ ఏకంగా తనకి వచ్చిన క్రేజ్ తో ఓ మోడల్ ను పెళ్ళి చేసుకోబోతున్నాడు.

వివరాల్లోకి వెళితే…తమిళ నటుడు మహత్ రాఘవేంద్ర ‘బిగ్ బాస్’ కి ముందు కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసాడు. అయితే బిగ్ బాస్ కు వెళ్ళాక ఈయన క్రేజ్ మరింతగా పెరిగింది. ఇక ప్రముఖ మోడల్ మరియు హాట్ బ్యూటీ అయిన ప్రాచి మిశ్రా తో చాలా కాలం నుండీ సహజీవనం సాగిస్తూ వస్తున్నాడు. అయితే ఇప్పుడు వీరి పెళ్ళికి పెద్దల నుండీ గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. దీంతో ఫిబ్రవరిలో వీరిద్దరూ సీక్రెట్ గా పెళ్ళి చేసుకోబోతున్నట్టు తెలుస్తుంది.

1

2

3

4

5

6

7

8

9

10

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus