Ariyana: అరియానా గ్లోరీ పెళ్లి పై సెన్సేషనల్ న్యూస్..!

‘ఐ యాం బోల్డ్’ అంటూ సెన్సేషన్ క్రియేట్ చేసిన బ్యూటీ అరియానా గ్లోరీ. గతంలో యాంకర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి కొంతమంది సినీ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ వచ్చింది ఈ బ్యూటీ. అయితే రాంగోపాల్ వర్మ తో చేసిన ఇంటర్వ్యూతో ఈమె బాగా ఫేమస్ అయ్యింది. ఆ ఇంటర్వ్యూలో వర్మ ఈమె గ్లామర్ గురించి పలు బోల్డ్ కామెంట్స్ చెయ్యడం.. ఆ తరువాత ఈమె కూడా బోల్డ్ గా రియాక్ట్ అవ్వడంతో ఆ ఇంటర్వ్యూ బాగా వైరల్ అయ్యింది.. అలాగే అరియానా పాపులారిటీ కూడా పెరిగింది. ఇక ‘బిగ్ బాస్4’ రియాలిటీ షోలో పాల్గొన్న తరువాత అరియనా క్రేజ్ భారీగా పెరిగిందనే చెప్పాలి.

‘బిగ్ బాస్4’ మొదలైనప్పుడు ఈమెను మొదట సీక్రెట్ రూమ్ కు పంపించారు. అటు తరువాత హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. హౌస్ లో ఉన్నన్ని రోజులు టాస్కులు చాలా తెలివిగా ఆడేది అరియనా. అందుకే ఈమె టాప్-5 వరకూ వెళ్ళి టాప్-4 కంటెస్టెంట్ గా నిలిచింది. హౌస్ లో ఉన్నప్పుడు తోటి కంటెస్టెంట్ అయిన ముక్కు అవినాష్ తో చాలా క్లోజ్ గా మూవ్ అయ్యేది అరియనా. దాంతో వీళ్ళ మధ్య ప్రేమ చిగురించింది అనే కామెంట్లు కూడా వినపడ్డాయి.

ఇదే విషయం పై హౌస్లో ఉన్న కంటెస్టెంట్లు కూడా గుసగుసలాడుతూ కనిపించేవారు.. దాంతో తనకి ఆల్రెడీ ఓ ఎన్నారైతో తన పెళ్లి ఫిక్స్ అయ్యిందని చెప్పుకొచ్చింది అరియనా..! ఇదిలా ఉండగా ఇటీవల ఈమె పెళ్లి కూతురు గెటప్ లో కనిపించడంతో అంతా ఈమెకు పెళ్లి ఫిక్స్ అయ్యిందని.. ఆ ఎన్నారైనే ఈమె పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు పుట్టించారు. కానీ ఓ యాడ్ కోసం అరియనా పెళ్లి కూతురు గెటప్ లో ఫోటో షూట్లో పాల్గొందట.. అందుకే ఈ ఫోటో వైరల్ అవుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం చేతి నిండా షోలు.. సినిమాలతో బిజీగా ఉన్న అరియనా ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
‘జెర్సీ’ లోని ఈ 15 ఎమోషనల్ డైలాగ్స్ ను ఎప్పటికీ మరచిపోలేము..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus