‘బిగ్ బాస్’ ఫైమా ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

  • May 1, 2023 / 08:51 AM IST

ఫైమా షేక్ ఇలా చెబితే షాకవుతారేమో.. అదే ‘జబర్దస్త్’ ఫైమా అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఈమె ఓ ముస్లిం కుటుంబానికి చెందిన అమ్మాయి. ఫైమాతో కలిపి వీరి తల్లిదండ్రులకు 4 మంది ఆడపిల్లలు.చిన్నతనంలోనే ఈమె తండ్రి మరణించాడు. దీంతో ఫైమా తల్లికి తన నలుగురు ఆడపిల్లలను పెంచడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. నిలువ నీడ కూడా లేని స్థితిలో కూడా తన పిల్లలకు మంచి చదువు చెప్పించాలనేది ఈమె తపన.

అయితే అలాంటి టైంలో ఫైమాకి ‘పటాస్’ షోలో అవకాశం లభించింది. యాంకర్ రవి ఆమెను ఎంకరేజ్ చేసి ఛాన్స్ ఇప్పించాడు. అప్పటి నుండి ఈమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అటు తర్వాత ‘పోవే పోరా’ ‘జబర్దస్త్’ వంటి షోలు ఈమె కెరీర్ ను మార్చేశాయి. గత ఏడాది ఈమె బిగ్ బాస్ 6లో కూడా పాల్గొంది. ఈ రకంగా ఫైమా మొత్తంగా బాగానే సంపాదించినట్టు వినికిడి.ఈమె తన తల్లికి అండగా నిలబడి తన సోదరిల జీవితాన్ని చక్కదిద్దింది.

అంతేకాదు హైదరాబాద్లో సొంతంగా ఇల్లు కొనుక్కుంది.ఈ మధ్యనే లగ్జరీ కారును కూడా కొనుగోలు చేసింది. ‘జబర్దస్త్’ ‘బిగ్ బాస్’ ‘బిబి జోడి’ ‘యూట్యూబ్’.. ఇలా అన్నిటి ద్వారా ఫైమా భారీగానే సంపాదించినట్టు తెలుస్తుంది. మొత్తంగా ఆమెకు ప్రస్తుతం కోటి పైనే ఆస్తులు ఉన్నాయి. తనలోని కామెడీ టైమింగ్ ఫైమాకి బాగా ప్లస్ అయ్యింది.

గతంలో ఎన్నో అవమానాలు పొందింది. నల్లగా ఉందని ఆమెను ఎంతో మంచి అవహేళన చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఫైనల్ అందం తిండి పెట్టదు.. టాలెంట్ అన్నీ తెచ్చి పెడుతుంది అని ఈమె ప్రూవ్ చేసింది.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus