బిగ్ బాస్ కంటెస్టెంట్ కి బంపర్ ఆఫర్..!

  • January 27, 2021 / 06:19 PM IST

బిగ్ బాస్ సీజన్ 4 తెలుగులో ఎంత పాపులర్ అయ్యిందో, తమిళంలో కూడా అంతే పాపులర్ అయ్యింది. అంతేకాదు, తెలుగు తమిళ భాషల్లో హోస్ట్ లు అయిన నాగార్జున ఇంకా కమల్ హాసన్ లు ఒకేసారి వర్చువల్ గా ఒకరినొకరు పలకరించుకున్నారు కూడా. ఈసారి సీజన్ 4 లో తెలుగులో వచ్చిన పార్టిసిపెంట్స్ బయట మంచి అవకాశాలే దక్కించుకుంటున్నారు. అలాగే ఇప్పుడు తమిళ బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసిన నటి రమ్య పాండియన్ కి కూడా వరుస ఆఫర్లు వస్తున్నాయట.

ఇందులో భాగంగా 2డి ఎంటర్ టైన్మెంట్ సంస్థలో వస్తున్న సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసినట్లుగా సమాచారం తెలుస్తోంది. అరిసిల్ మూర్తి డైరెక్ట్ చేస్తున్న ఒక సినిమాకోసమై రమ్య పాండియన్ ని సెలక్ట్ చేశారట. ప్రతివారం బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేషన్స్ టైమ్ లో ట్రెండింగ్ స్టార్ గా న్యూస్ లో నిలిచింది రమ్య పాండియన్. పొలిటికల్ సెటైర్ ఫిలిం జోకర్ లో 2016లో యాక్ట్ చేసింది రమ్య. ఆ తర్వాత 2018లో ఆన్ దేవతై లో నటించింది.

పలు కుకరీ షోలు, టీవిషోల ద్వారా మంచి పాపులారిటీనీ సంపాదించి బిగ్ బాస్ సీజన్ 4లోకి అడుగుపెట్టింది. ఇప్పుడు హీరోయిన్ గా మంచి ఛాన్స్ కొట్టేసిందని చెప్తున్నారు కోలీవుడ్ తంబీలు. అదీ మేటర్.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
సౌత్ లో సక్సెస్ అయిన టాక్ షోలు.. ఏ తారలు హోస్ట్ చేసినవంటే..!
వరల్డ్ రికార్డ్ కొట్టి.. టాలీవుడ్ స్థాయిని పెంచిన సెలబ్రిటీల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus