Sivaji: కూతురు గురించి క్లారిటీ ఇచ్చిన శివాజీ!

  • January 15, 2024 / 03:36 PM IST

బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు శివాజీ ఒకరు. నటుడుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి ఈయన అనంతరం బిగ్ బాస్ కార్యక్రమానికి కంటెస్టెంట్ గా వెళ్లారు. మొదటి నుంచి కూడా టైటిల్ రేసులో ఉన్నటువంటి ఈయన చివరి వారాలలో కాస్త వెనుకబడటంతో టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అయ్యారు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత శివాజీ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

అదే విధంగా ఈయన నటించిన వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ కావడంతో శివాజీ పలు ఇంటర్వ్యూలలో బిజీగా గడుపుతున్నారు. ఇక ఈయన ఒకానొక సమయంలో రాజకీయాల పరంగా కూడా పెద్ద ఎత్తున వార్తలలో నిలిచిన సంగతి మనకు తెలిసిందే. ఇలా రాజకీయాల పరంగా ఈయన వార్తలలో నిలబడటమే కాకుండా రాజకీయ ఆరోపణలు చేస్తూ భారీగానే డబ్బులు కూడా సంపాదించారు అంటూ వార్తలు వచ్చాయి.

దీనిపై మీ అభిప్రాయం ఏంటి అంటూ శివాజీని ప్రశ్నించడంతో ఈ వ్యాఖ్యలపై శివాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను డబ్బు సంపాదించాను అనే విషయాలు కనక ఎవరైనా నిరూపిస్తే నేను ఇప్పుడే ఆత్మహత్య చేసుకుని చనిపోతాను అంటూ ఈయన యాంకర్ పై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఈయనకు రెండో పెళ్లి జరిగిందని ఒక పాప కూడా ఉంది అంటూ వార్తలు వచ్చాయి అయితే వార్తలు పై కూడా శివాజీ స్పందిస్తూ..

ఇవన్నీ కేవలం వ్యూస్ కోసం మాత్రమే చేసే పనులని నా జీవితం అందరికీ తెలిసినదే కదా అంటూ ఈ వార్తలను కొట్టి పారేశారు. అయితే బిగ్ బాస్ టైటిల్ కోల్పోవడానికి చివరి వారాలలో నన్ను విలన్ గా చేసి చూపించడమే కారణమని అందుకే టైటిల్ కోల్పోయాను అంటూ ఈ సందర్భంగా శివాజీ చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus