Syed Sohel Ryan: జారిపడి సముద్రంలో పడ్డ బిగ్ బాస్ కంటెస్టెంట్!

  • December 24, 2022 / 04:22 PM IST

బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సోహెల్. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకొచ్చిన తరువాత ఆయనకు పలు సినిమా అవకాశాలు వచ్చాయి. తాజాగా అతడు నటించిన సినిమా ‘లక్కీ లక్ష్మణ్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ వెరైటీగా నిర్వహించాలని భావించారు. దీనికోసం యూట్యూబర్ లోకల్ బాయ్ నానితో కలిసి ప్రమోషన్స్ చేయాలనుకున్నారు. లోకల్ బాయ్ నాని వైజాగ్ కి చెందిన వ్యక్తి. ఇతడికి యూట్యూబ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది.

సముద్రంలో చేపల వేటకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ బాగా పాపులర్ అయ్యారు. ఆయనతో కలిసి తన సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి సోహైల్ వైజాగ్ కు వెళ్లారు. మాస్ లుక్ లో లుంగీ కట్టి, తలకు పాగా చుట్టి కనిపించారు. నాని, సోహెల్ కలిసి బోటులో సముద్రంలోకి వెళ్లి చేపల వేట మొదలు పెట్టాలనుకున్నారు. బోటు చివరన నిలబడి చేపలు ఎలా పడతారో నాని చూపిస్తున్నారు. నాని చెప్పినట్లుగా కొన్ని టెక్నిక్స్ వాడి సోహైల్ చేపలు పట్టుకోవడానికి ప్రయత్నించారు.

ఆ తరువాత బోటు అంచున నిలబడి ఫొటోలు దిగడానికి ప్రయత్నించారు సోహైల్. ఈ క్రమంలో తన కాళ్లు పట్టు తప్పడంతో సముద్రంలో పడిపోయారు సోహైల్. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. సోహైల్ టెన్షన్ లో గట్టిగా అరిచేశారు. వెంటనే నాని సముద్రంలోకి దూకి సోహైల్ ను పట్టుకున్నారు. తాళ్ల సాయంతో సోహైల్ ను బోటులోకి లాగారు. సోహైల్ కి క్షణాల్లో ప్రాణాపాయం తప్పింది. మోకాళ్లకు చిన్న గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను లోకల్ బాయ్ నాని తన యూట్యూబ్ ఛానెల్ లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus