Lobo: లోబో ఆస్తుల చిట్టా తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

  • October 6, 2021 / 07:22 PM IST

‘బిగ్ బాస్-5’ 6వ కంటెస్టెంట్ ఎంట్రీ ఇచ్చాడు లోబో. ‘బిగ్ బాస్’ కు రాకముందు ఇతను ఎక్కువ మందికి తెలిసుండదు. కానీ ఇతను హౌస్ లోకి వచ్చాక.. అందరినీ ఎంటర్టైన్ చేస్తుండడంతో లోబో గురించి గూగుల్ తల్లిని ఎక్కువగా అడుగుతున్నారు.లోబో అసలు పేరు మహమ్మద్‌ ఖయ్యూం.అతని 9వ తరగతిలో ఉన్నప్పుడు స్కూల్లో దొంగతనం చేస్తూ దొరికిపోవడంతో అతనికి టీసీ ఇచ్చి పంపించేశారు.దాంతో అతనికి చదువు పెద్దగా అబ్బలేదు.అయితే తర్వాత అతను ఓ టాటూ షాపులో పని చేయడం మొదలు పెట్టాడు.

ఈ క్రమంలో మొదటి టాటూని లోబో ఓ రష్యన్‌ యువతికి వేశాడు. ఆ అమ్మాయి మనోడి వేషధారణ చూసి అవాక్కయ్యి లోబో అనే పేరుని పెట్టింది. ఇతను పక్కా హైదరాబాదీ అన్న సంగతి తెలిసిందే. మొదట స్టార్ మా మ్యూజిక్ లో ఇతను యాంకర్ గా చేసాడు. కొన్ని సినిమాల్లో కూడా నటించాడు. అయితే లోబోకి ఆస్తులు కూడా ఎక్కువేనట. అతనికి హైదరాబాద్ సమీపంలో ఖరీదైన ఫ్లాట్లు ఉన్నాయి.BMW కారు కూడా ఉందట. ఈ విషయాలను అతని సోదరుడు ఇర్ఫాన్ చెప్పుకొచ్చాడు.

అతను పాల్గొన్న కొన్ని ఇంటర్వ్యూలలో ఈ విషయాలను తెలియజేసాడు. అంటే లోబో మామూలు వ్యక్తి కాదన్న మాట. ఇక ఇర్ఫాన్ అతని గురించి మరింతగా మాట్లాడుతూ.. ‘లోబోది చిన్నపిల్లాడి మనస్తత్వమని…అతనికి కోపం అంతే ఫాస్ట్ గా వస్తుంది అలాగే అది ఎక్కువ సేపు ఉండదని.. బిగ్ బాస్ లో అతను లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఉండదని’ చెప్పుకొచ్చాడు ఇర్ఫాన్.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus