హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!

ఒక సినిమాకి హిట్ టాక్ వచ్చిందంటే..అప్పుడున్న సీజన్ ను బట్టి దాన్ని మరింతగా క్యాష్ చేసుకోవాలని దర్శకనిర్మాతలు భావిస్తుంటారు. అందుకోసం లెంగ్త్ ఎక్కువవుతుంది అని ఎడిటింగ్ లో లేపేసిన సీన్స్ లేదా పాటలను మళ్ళీ జోడిస్తూ ఉంటారు. ఇలా సీన్లు లేదా సాంగ్ ను యాడ్ చేసినట్లు మళ్ళీ ప్రమోట్ చేసి.. జనాలను మళ్ళీ థియేటర్ కు రప్పిస్తుంటారు.ఈ టెక్నిక్ చాలా కాలం నుండీ వాడుతున్నారు.మరి రిలీజ్ తర్వాత అలా సీన్లు లేదా సాంగ్ వంటివి యాడ్ చేసిన సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) చూడాలని ఉంది :

చిరంజీవి నటించిన ఈ సూపర్ హిట్ మూవీ విడుదలైన కొద్దిరోజుల తర్వాత ఓ పాటను యాడ్ చేసి మళ్ళీ జనాలను థియేటర్ కు రప్పించారు.

2) శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్ :

చిరంజీవి నటించిన ఈ సూపర్ హిట్ మూవీ విడుదలై 50 రోజులు పూర్తయిన తర్వాత ఓ పాటను యాడ్ చేశారు.

3) మగధీర :

రాంచరణ్- రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలై 50 రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కొన్ని సీన్లను యాడ్ చేశారు.

4) అత్తారింటికి దారేది :

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో కూడా పలు సీన్లను యాడ్ చేసి జనాలను మళ్ళీ థియేటర్లకు రప్పించారు.

5) మిర్చి :

ప్రభాస్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన కొద్దిరోజుల తర్వాత ఓ ఫైట్ సీన్ ను యాడ్ చేశారు.

6) శ్రీమంతుడు :

మహేష్ బాబు హీరోగా కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన 4 వారాల తర్వాత పలు సీన్లు యాడ్ చేశారు.

7) సన్ ఆఫ్ సత్యమూర్తి :

అల్లు అర్జున్- త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో కూడా పలు సీన్స్ యాడ్ చేశారు.

8) అజ్ఞాతవాసి :

పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమా విడుదలై ప్లాప్ టాక్ వచ్చినప్పటికీ కొన్ని హీరో వెంకటేష్ తో షూట్ చేసిన సీన్లు యాడ్ చేశారు.

9) ఎఫ్2 :

వెంకటేష్,వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన కొద్దిరోజుల తర్వాత కొన్ని సీన్లను యాడ్ చేశారు.

10) సరిలేరు నీకెవ్వరు :

మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన కొద్దిరోజుల తర్వాత పలు సీన్లు యాడ్ చేశారు.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus