Priyanka Singh: ‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!

‘బిగ్ బాస్5’ కి 9వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది ప్రియాంక సింగ్.మొదట అబ్బాయిగా ఉండి సర్జెరీల ద్వారా అమ్మాయిగా మారాడు. ‘జబర్ధస్త్’ కామెడీ షో చూసే ప్రేక్షకులకు ఈమెను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె గురించి మరికొన్ని విషయాలను తెలుసుకుందాం రండి :

1) 1995లో హైదరాబాద్ లో ప్రియాంక సింగ్ జన్మించింది. ఈమెకు ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నయ్యలు. ఈమె నాన్నగారు ల్యాబ్ అటెండర్ గా వర్క్ చేసేవారు. అంతేకాదు సాయితేజ్ గా ఉన్నప్పుడు.. ల్యాబ్ అటెండర్ గా కూడా వర్క్ చేసేవారు ప్రియాంక సింగ్.

2) సినిమాల పై ఇంట్రెస్ట్ ఉన్నా.. మొదట్లో ప్రియాంక సింగ్ కు అవకాశాలు రాలేదు. చాలా కష్టపడితే ‘జబర్దస్త్’ లో అవకాశం లభించింది.

3) ‘జబర్దస్త్’ కామెడీ షోలో ఎక్కువగా లేడీ గెటప్ లు వేసేవాడు(వేసింది). ఆ షో ప్రియాంక సింగ్ కు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది.

4) టిక్ టాక్ వీడియోలతో ప్రియాంక సింగ్ మరింత పాపులర్ అయ్యింది. సోషల్ మీడియాలో ఈమెకు ఫాలోవర్లు కూడా ఎక్కువే..!

5) నారా రోహిత్ హీరోగా నటించిన ‘బాలకృష్ణుడు’ సినిమాతో వెండితెర పై కూడా ఎంట్రీ ఇచ్చింది. అటు తర్వాత ‘మనసైనోడు’ అనే సినిమాల్లో కూడా నటించింది.

6) చిన్నప్పటి నుండీ అమ్మాయిగా మారాలనేది సాయి తేజ్ కోరిక. చిన్నప్పుడు ఎక్కువగా వీళ్ళ అక్క బట్టలు వేసుకునే వాడు.

7) సాయి తేజ్ .. ప్రియాంకా సింగ్ గా మారడానికి లక్షల రూపాయలు ఖర్చు చేసినట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.అంతేకాకుండా సర్జెరీ కోసం తాను ఖర్చు చేసిన డబ్బంతా కూడా.. తన కష్టార్జితమే అని కూడా తెలిపారు.

8) ప్రియాంకా సింగ్ అమ్మాయిగా మారిన విషయం.. వాళ్ళ ఇంట్లో వాళ్లకి తెలీదట. ఒకసారి వీళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు క్లీన్ షేవ్లో ఉంటే.. వీళ్ళ నాన్న గారు.. ‘ఏంట్రా క్లీన్ షేవ్ చేసావ్.. ఇలా రా’ అని అన్నారట. కానీ భయంతో వాళ్ళ నాన్నగారి దగ్గరకి వెళ్లలేకపోయారు ప్రియాంక సింగ్. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యే ముందు హోస్ట్ నాగార్జున గారి సమక్షంలో ఈ విషయం తన తండ్రికి తెలియజేసారు.

9) సాయి తేజ్.. ప్రియాంక సింగ్ గా మారిన విషయం వాళ్ళ తల్లిగారికి తెలుసు. ఆమె మొదట భయపడింది.. కానీ తర్వాత అర్ధం చేసుకుందట.

10) ప్రియాంక సింగ్.. సినీ పరిశ్రమలోనే ఎక్కువగా కొనసాగాలని భావిస్తోంది. అందుకోసం ఎక్స్పోజింగ్ చేయడానికి కూడా రెడీ అని ‘అదిరింది’ అనే షోలో తెలియజేసారు. అంతేకాదు ఇందుకోసం పెళ్లి అనే దానికి దూరమవ్వడాన్ని కూడా లెక్కచేయకుండానే అమ్మాయిగా మారినట్టు కూడా ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus