ఆ టాస్క్ లో హారికని చూసి ఏడ్చేశా.. తల్లి ఆవేదన!

  • November 11, 2020 / 12:45 PM IST

బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా పాల్గొన్న దేత్తడి హారిక హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మారింది. ఫిజికల్ టాస్క్ లలో కూడా వెనక్కి తగ్గకుండా తన బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉండగా.. గత కొన్నిరోజులుగా హారికాకి లవ్ ఎఫైర్ ఉందంటూ సోషల్ మీడియాలో రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. వీటిపై హారిక తల్లి, ఆమె సోదరుడు స్పందించారు. తాజాగా ఫిల్మ్ ఫోకస్ జరిపిన ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి మాట్లాడారు.

హారికకు ఎలాంటి లవ్ ఎఫైర్లు లేవని, ఆమె తన కెరీర్ పై చాలా ఫోకస్డ్ గా ఉంటుందని హారిక తల్లి వివరించారు. తనకు లవ్ ఎఫైర్ ఉన్నా బయటకి చెప్పడంలో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని.. ప్రస్తుతానికి ఆమె తన కెరీర్ పైనే దృష్టి పెడుతుందని, పెళ్లి టాపిక్ తీసుకొచ్చినా.. ఇప్పట్లో చేసుకోనని తేల్చి చెప్పిందని వెల్లడించారు. ఇక బీబీ కేర్ టేకర్ టాస్క్ లో అమ్మారాజశేఖర్ తన కూతుర్ని మెడపట్టి లాగేశారని.. అది చూసి తట్టుకోలేకపోయానని హారిక తల్లి కన్నీళ్లు పెట్టుకున్నారు.

హౌస్ లో తనను టార్గెట్ చేస్తున్నారనిపిస్తుందని చెప్పిన ఆమె ఎవరు చేస్తున్నారనే విషయంలో మౌనం వహించారు. హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ లను టార్గెట్ చేయడం కామన్ అని.. తను మాత్రం హారిక గేమ్ ఎలా ఆడుతుందో చూస్తున్నానని ఆమె సోదరుడు వంశీ అన్నారు. హారికా కచ్చితంగా టాప్ 5లో ఉంటుందని నమ్మకంగా చెబుతున్నారు. ట్రోఫీ గెలవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

Most Recommended Video

ఈ 15 సినిమాలకి మొదటి ఛాయిస్ ఈ హీరోయిన్లు కాదు.. మరెవరో తెలుసా..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!
‘కలర్ ఫోటో’ నుండీ హృదయాన్ని హత్తుకునే 15 డైలాగులు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus