ఈ 15 సినిమాలకి మొదటి ఛాయిస్ ఈ హీరోయిన్లు కాదు.. మరెవరో తెలుసా..!

ఏ చిత్రానికి అయినా ముందుగా ప్రీ ప్రొడక్షన్ పనులు నిర్వహిస్తుంటారు దర్శకనిర్మాతలు.ఈ విషయం అందరికీ తెలిసిందే. దీని ద్వారా నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతుంది. ముఖ్యంగా హీరోయిన్ల ఎంపిక విషయంలో దర్శకనిర్మాతలు.. లుక్ టెస్ట్ చేసిన తరువాతే ఓ నిర్ణయం తీసుకుంటారు. అలా వారు అనుకున్న హీరోయిన్ … తరువాత ఫైనల్ అయ్యే హీరోయిన్ ఒకళ్ళే అవుతారని కచ్చితంగా చెప్పలేము. ఉదాహరణకు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రాన్నే తీసుకుందాం.

ముందుగా ఈ చిత్రంలో హీరోయిన్ గా ఆనిషా అంబ్రోస్ ను అనుకున్నారు. కానీ లుక్ టెస్ట్ లో ఆమె సెట్ అవ్వకపోవడంతో కాజల్ అగర్వాల్ కు ఆ ఛాన్స్ దక్కింది. అలా చాలా సూపర్ హిట్ సినిమాలకు.. దర్శకనిర్మాతలు ముందుగా అనుకున్న హీరోయిన్ ఒకరైతే.. తరువాత ఫైనల్ అయిన వారు మరొకరయ్యారు. అలాగని అన్ని సినిమాలకు ఇదే ప్రక్రియ వర్కౌట్ అవుతుందని చెప్పలేము.ముందుగా వారు అనుకున్న హీరోయిన్ల డేట్స్ అడ్జస్ట్మెంట్ కుదరకపోవడం మరియు ఇతర కారణాల వల్ల కూడా హీరోయిన్ మారే అవకాశం ఉంది. సరే అలా ఈమధ్య కాలంలో కొన్ని కారణాల వలన మంచి సినిమాల్లో నటించే అవకాశం కోల్పోయిన హీరోయిన్లను .. అలాగే ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచున్న హీరోయిన్లను ఓ లుక్కేద్దాం రండి :

1) రంగస్థలం: ఈ చిత్రంలో చరణ్ సరసన ముందుగా అనుపమ పరమేశ్వరన్ ను అనుకున్నాడు దర్శకుడు సుకుమార్. కానీ సమంత ఫైనల్ అయ్యింది.

2) నారప్ప: మన మంచి డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల.. ఈ చిత్రంలో హీరోయిన్ గా అనుష్కను అనుకున్నాడు. కానీ ప్రియమణి ఫైనల్ అయ్యింది.

3) రాజు గారి గది3: ఈ చిత్రంలో తమన్నాను అనుకున్నాడు దర్శకుడు ఓంకార్. కానీ అవికా గోర్ ను ఫైనల్ అయ్యింది.

4) చెలియా: మన మణిరత్నం సర్…. ఈ చిత్రంలో హీరోయిన్ గా సాయి పల్లవిని అనుకున్నాడు. కానీ అదితీ రావు హైదరి ఫైనల్ అయ్యింది.

5) జెర్సీ (హిందీ): ఈ చిత్రంలో రష్మికను అనుకున్నారు కానీ మృణాల్ ఠాకూర్ ఫైనల్ అయ్యింది.

6) బాక్సర్( వరుణ్ తేజ్ 10- వర్కింగ్ టైటిల్ ): ఈ చిత్రానికి కైరా అద్వానీని అనుకున్నారు .. కానీ సాయి మంజ్రేకర్ ఫైనల్ అయ్యింది.

7) కొచ్చడియన్: ముందుగా ఈ చిత్రంలో అనుష్కను అనుకున్నారు. కానీ దీపికా పదుకొనె ను ఫైనల్ చేశారు.

8) గీత గోవిందం: ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ ను అనుకున్నారు.. కానీ రష్మిక మందన ఫైనల్ అయ్యింది.

9) రాక్షసుడు: ‘రాట్ససన్’ రీమేక్ అయిన ‘రాక్షసుడు’ లో మొదట రాశీ ఖన్నాను అనుకున్నారు. కానీ అనుపమ ఫైనల్ అయ్యింది.

10) అందాదున్ రీమేక్: ముందుగా పూజా హెగ్డేను హీరోయిన్ గా అనుకున్నారు.. చివరికి నభా నటేష్ ఫిక్స్ అయ్యింది.

11) మహానటి: సావిత్రి గారి బయోపిక్ కోసం మొదట నిత్యా మేనన్ ను అనుకున్నారు. చివరికి కీర్తి సురేష్ ఫైనల్ అయ్యింది.

12) జెంటిల్మెన్(2016): ఈ చిత్రంలో సురభి పాత్ర కోసం ముందుగా నిత్యా మేనన్ ను అనుకున్నారట.

13) అమర్ అక్బర్ ఆంటోనీ: ఈ చిత్రంలో ముందుగా అనూ ఇమాన్యుల్ ను అనుకున్నారు. చివరికి ఇలియానా రీ ఎంట్రీ ఇచ్చింది.

14) బిజినెస్ మెన్: ముందుగా శృతీ హాసన్ ను అనుకున్నారు కానీ కాజల్ ఫైనల్ అయ్యింది.

15) రెబల్: ఈ చిత్రంలో తమన్నా పాత్రకు ముందుగా అనుష్కను అనుకున్నారు.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus