Sohel: సినిమా చూడాలంటూ కన్నీళ్లు పెట్టుకున్న సోహెల్.. ఏమైందంటే?

  • February 3, 2024 / 01:12 PM IST

బిగ్ బాస్ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న సోహెల్ నటించిన బూట్ కట్ బాలరాజు సినిమా తాజాగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి, క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ రివ్యూస్ వస్తున్నాయి. ఈ సినిమాకు బుకింగ్స్ కూడా మరీ భారీ స్థాయిలో అయితే లేవనే సంగతి తెలిసిందే. పరిమిత సంఖ్యలో షోలతో ఈ సినిమా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. అయితే బిగ్ బాస్ సోహెల్ ఫ్రస్టేట్ అవుతూ చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

తనను ప్రేక్షకులు బిగ్ బాస్ షోలో ఉన్న సమయంలో ఎంతో ప్రోత్సహించారని సోహెల్ సోహెల్ అంటూ అరిచారని అయితే ఇప్పుడు నా సినిమాను చూడటానికి మాత్రం ప్రేక్షకులు రావడం లేదని సోహెల్ చెప్పుకొచ్చారు. లవ్ స్టోరీస్, లిప్ లాక్ సీన్స్ ఉన్న సినిమాలు మాత్రమే చూస్తారా అంటూ సోహెల్ ప్రశ్నించారు. కుటుంబ ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమాలు ఉంటే చూడరా అంటూ సోహెల్ ఆవేదన వ్యక్తం చేశారు.

నా తాహతుకు అనుగుణంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించానని ప్రతిసారి స్నేహితులతో మాత్రమే కాదని కుటుంబ సభ్యులతో కూడా సినిమాలు చూడాలని సోహెల్ చెబుతున్నారు. నా సినిమా చూడటానికి బాగానే ఉందంటూ సోహెల్ కన్నీళ్లు పెట్టుకోవడం గమనార్హం. బూట్ కట్ బాలరాజు కలెక్షన్లు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాలి. బూట్ కట్ బాలరాజు సినిమాకు సోహెల్ నిర్మాతగా కూడా వ్యవహరించడం గమనార్హం.

బూట్ కట్ బాలరాజు కలెక్షన్లు పుంజుకోవడం సులువు అయితే కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి. (Sohel) సోహల్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని ఫ్యాన్స్ నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. హనుమాన్ మూవీ ఇప్పటికీ ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో ప్రదర్శితమవుతూ ఉండగా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా సైతం పాజిటివ్ టాక్ తో థియేటర్లలో ప్రదర్శితమవుతోంది.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus